Top
Batukamma

కరోనా లేదంటివి.. ఎన్నికలంటివి.. ఈ కవరింగులేందయ్యా సామీ..!

కరోనా లేదంటివి.. ఎన్నికలంటివి.. ఈ కవరింగులేందయ్యా సామీ..!
X
Highlights

పోనీలే అనుకున్నవాళ్ళు కూడా చుట్టూ అద్దాలు పెట్టుకుని ఆయన చేసిన అతిని చూసి ఆ ఆలోచన విరమించుకుని ఉంటారు.

న్యాయం తన వైపు ఉందనుకున్నప్పుడు హుందాగా, గర్వంగా, దర్పంతో పూర్తిస్థాయి ప్రెస్ మీట్ పెట్టాలి. విలేఖరుల నుంచి ప్రశ్నలు తీసుకుని సమాధానం చెప్పాలి. ఎదుటివాడు ఎలాంటి స్వరంతో ప్రశ్నలు వేసినా, ఎలాంటి ప్రశ్నలు వేసినా సమాధానాలు ఆయన ఎలా చెప్పాలనుకుంటున్నాడో అలా చెప్పే స్థితప్రజ్ఞత ఆయనకు లేనప్పుడు ఇన్నాళ్ల అనుభవం, వయసు వృథా.

విధులు నిర్వహించబోయే ఉద్యోగులకు, ప్రజలకు కోవిడ్ సోకకుండా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిన బాధ్యతని, అవకాశాన్ని విస్మరించి ఆయన మాత్రం చుట్టూ అద్దాలు పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడం జుగుప్సాకరంగా ఉంది. పాపం పోనీలే, ఎన్నికలు జరిగితే విధులు నిర్వహిద్దాం అనుకున్నవాళ్ళు కూడా చుట్టూ అద్దాలు పెట్టుకుని ఆయన చేసిన అతిని చూసి ఆ ఆలోచన విరమించుకుని ఉంటారు.

ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే కోవిడ్ రక్షణ వ్యవస్థని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడానికి కావలసిన నిధులు సమకూర్చమని ప్రభుత్వంలో వారిని గానీ, చీఫ్ సెక్రెటరీని గానీ అడిగాడా? ప్రభుత్వం సహకరించకపోతే ఏ రాజ్యాంగ వ్యవస్థా పనిచేయలేదన్న అతి చిన్న విషయం ఎలా విస్మరిస్తున్నాడు?

పోనీ ఆయనకేమన్నా నిజాయితీ గల అధికారిగా పేరుందా? అదే ఆయన బలం, శక్తి అనడానికి? టీడీపీ తొత్తని ఆయనే బహిరంగంగా (చాటుగా చేసినా దొరికిపోయి) చాలా సార్లు నిరూపించుకున్నాడు. టీడీపీ ప్రభుత్వం లో ఉన్నప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు? అప్పుడు ప్రతికూల ఫలితాలు వస్తే అసెంబ్లీ ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయని "హిందూ" మాజీ ముఖ్యమంత్రి చెప్పి ఉంటాడు.

ఉద్యోగ సంఘాలు మొత్తం మేము విధులు నిర్వహించం అంటే ఎలక్షన్ కమిషన్ చేయగలిగింది ఏముంటుంది? అందరినీ సస్పెండ్ చేస్తుందా? ప్రభుత్వం సహకరించకపోతే ఆ సస్పెన్షన్ కి విలువేముంటుంది? సస్పెన్షన్ లో ఉన్నవాళ్ళకి జీతాలు ఎందుకు వేశావు అని కోర్టులు ప్రభుత్వాన్ని నిలదీస్తాయా?

మూడు నెలలు హాయిగా హైదరాబాద్ ఇంట్లో కోటేసుకుని OTT లలో సినిమాలు, వెబ్ సిరీసులు చూసుకుని ప్రశాంతంగా గడిపి తర్వాత రిటైర్ అవండి. ఈలోపు ఆంధ్రా అధికారిగా వ్యాక్సిన్ వేయించుకునే మీవంతు వస్తే వచ్చి వేయించుకుని పోండి. బోర్ కొట్టకుండా ఆంధ్రా ప్రతిపక్ష నాయకుడు నాయుడు గారిని కూడా తీసుకురాండి. కొత్త ఎలక్షన్ కమీషనర్ రావడం మాత్రమే మీరు రిటైర్ అయ్యారు అనడానికి సంకేతం తప్ప మీ పదవీకాల ముగింపుని ఎవరూ గుర్తించి గౌరవించే పరిస్థితి లేదు.

-Ravikanth Reddy M

Next Story
Share it