తీరం దాటిన వాయుగుండం.. పొంచిఉన్న వానగండం

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నవర్షాలు ఇప్పుడప్పుడే తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నవర్షాలు ఇప్పుడప్పుడే తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే మరో మూడురోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణశాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
కొద్దిరోజులుగా టెన్షన్ పెట్టిస్తున్న వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారి తీరాన్ని దాటిందిద. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. కాకినాడ సమీపంలో తీరం దాటింది. సముద్రంలో ఉన్న సమయంలో గంటకు 17కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
వాయుగుండం తీరం దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రజలు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఇది 75 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకునే అవకాశముందని హెచ్చరించింది. వాయుగుండం ఎఫెక్ట్ తో దక్షిణ ఒడిశాతో పాటు.. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది.
TRENDING VIDEO: