Top
Batukamma

వేరు శనగ పొలంలో వజ్రం.. లక్షాధికారిగా మారిన కూలీ

వేరు శనగ పొలంలో వజ్రం.. లక్షాధికారిగా మారిన కూలీ
X
Highlights

అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో తెలియదు. కొన్ని క్షణాల్లో జీవితం పూర్తిగా మలుపుతిరిగిపోతుంది. కూలీ...

అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో తెలియదు. కొన్ని క్షణాల్లో జీవితం పూర్తిగా మలుపుతిరిగిపోతుంది. కూలీ పనిచేసుకునే వాళ్లు కోటీశ్వరులైపోతారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది.

కర్నూలు జిల్లాలోని తుగ్గళి మండలంలో ఈ అద్భుతమైన ఘటన జరిగింది. కొన్ని రోజులుగా తుగ్గ‌ళి మండ‌లంలోని జొన్న‌గిరి, ప‌గిడిరాయి గ్రామాల స‌రిహ‌ద్దుల్లో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్షాలు తగ్గడంతో వేరు శనగ పొలాల్లో పనులు ప్రారంభమయ్యాయి.

నిన్న వేరుశనగ పొలంలో కూలీలు పనిచేస్తున్నారు. ఆ సమయంలో ఓ మహిళా కూలీకి వజ్రం దొరికింది. మొదట అదేదో రాయి అనుకున్నా.. తర్వాత పరీక్షించ చూస్తే అది వజ్రం అని తేలింది. దీంతో ఆ కూలీ సంతోషానికి అవధుల్లేవు.

పొలంలో దొరికిన వజ్రాన్ని గుత్తికి చెందిన ఓ వజ్రాల వ్యాపారికి చూపించారు. అది చూసిన ఆయన.. 7 క్యారెట్లు ఉందని తేల్చాడు. దానికి 11 లక్షలతో పాటు.. మహిళలకు 2 తులాల బంగారం కూడా ఇచ్చాడు. వాస్తవానికి సాన పట్టిన తర్వాత ఈ వజ్రం విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

Next Story
Share it