Top
Batukamma

కలిసే గొంతు కోసుకున్నాం.. దివ్య తేజస్విని కేసులో కొత్త కోణం..!

divya tejaswini murder case
X
Highlights

విజయవాడ దివ్య తేజస్విని కేసులో కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. కొత్త విషయం బయటకు వచ్చింది.

విజయవాడ దివ్య తేజస్విని కేసులో కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఆమె ప్రియుడు నాగేందర్ గొంతు కోశాడని.. నిన్నటి వరకు పోలీసులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఈ కేసులో కొత్త విషయం బయటకు వచ్చింది.

నిందితుడు నాగేందర్ పోలీసుల ముందు చాలా విషయాలు చెప్పాడు. వాస్తవానికి తామిద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామన్నాడు. ఇద్దరం ఎవరి గొంతు వాళ్లమే కోసుకున్నామని చెప్పాడు. గొంతు కోసుకున్న తర్వాత ఇద్దరం స్పృహ తప్పి పడిపోయామన్నారు. తాను కూడా పడిపోయానని తెలిపాడు.



అయితే.. ఆ తర్వాత దివ్య తేజస్విని చేయి ఎవరు కోశారో తనకు తెలియదన్నాడు నాగేందర్. తాను స్పృహ తప్పి పడిపోయాక ఏం జరిగిందో తెలియదన్నాడు.

తామిద్దరం చాలాకాలంగా ప్రేమలో ఉన్నామని చెప్పాడు. అందుకే ఎవరికీ తెలియకుండా లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. అయితే ఇది నచ్చని దివ్య తేజస్విని తల్లిదండ్రులు తమని విడదీశారన్నాడు. ఇదే బాధతో తామిద్దరం చనిపోవాలనుకుంటున్నట్టు చెప్పాడు నాగేందర్.

Next Story
Share it