Top
Batukamma

రఘునందన్ రావు గెలుపు.. టెన్షన్ లో వైసీపీ..!

రఘునందన్ రావు గెలుపు.. టెన్షన్ లో వైసీపీ..!
X
Highlights

తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు బీజేపీలో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ ఒక్క గెలుపుతో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటుంది.

తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు బీజేపీలో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ ఒక్క గెలుపుతో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటుంది. గ్రేటర్ ఎన్నికల పోరులో కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అయితే ఈ దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల పైన ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇప్పటివరకు ఏపీలో ఎన్నికలు ఏదైనా సరే తేదేపా వర్సెస్ వైసీపీ అన్నట్టుగానే పోరు జరిగింది. కానీ దుబ్బాక ఎన్నికల ఫలితాలతో ఇప్పుడు వైసీపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దుబ్బాక లో గెలిచిన బీజేపీ తమ నెక్స్ట్ టార్గెట్ గా తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికే అని అంటోంది. త్వరలోనే తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ ఉపఎన్నికలో కూడా సత్తా చాటి ఏపీలో పార్టీని మరింతగా బలోపేతం చేస్తామని అంటున్నారు కమలనాథలు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కి పోటీగా ఎదుగుతున్న బీజేపీ ఏపీలో కూడా వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి వైసీపీకి కూడా తామే ప్రత్యామ్నాయంగా నిలవాలని భావిస్తోంది. అటు అధికార వైసీపీ కూడా బీజేపీ ని లైట్ తీసుకోకుండా జాగ్రత్త పడాలనే అభిప్రాయానికి వచ్చిందని అంటున్నారు.

ఇప్పటికే వైసీపీని టీడీపీ రాజకీయంగా ఇరకాటంలో పెడుతోంది. దీనికి తోడు బీజేపీ కూడా తోడైతే భవిష్యత్తులో ఇబ్బంది తప్పదని వైసీపీ నేతలు భావిస్తున్నారట. అందుకే పక్కగా వ్యూహరచన చేయాలని పార్టీ అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారట. మొత్తం మీద దుబ్బాక ఎన్నికల ఫలితాలు ఏపీలో కూడా ప్రభావితం చూపించబోతున్నాయట.

Next Story
Share it