Top
Batukamma

APకి బార్డర్ నుంచే బస్సులు.. అక్కడిదాకా రండి తీసుకెళ్తాం

APకి బార్డర్ నుంచే బస్సులు.. అక్కడిదాకా రండి తీసుకెళ్తాం
X
Highlights

అడపా దడపా ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసులు నడిపిస్తున్నా.. ఆర్టీసీ బస్సులు మాత్రం నడవడం లేదు.

కరోనా దెబ్బతో ఈ సారి దసరా సందడి తగ్గింది. ప్రతీసారి దసరా వచ్చిందంటే హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏపీకి వెళ్లేవారు. దీంతో బస్సులు కూడా దొరికేవి కాదు. ప్రైవేటు ట్రావెల్స్ అడ్డగోలు ధరలతో ప్రజలు దోచేస్తూ ఉండేవి.

కానీ ఈ సారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా దెబ్బతో చాలా ప్రయాణాలు మానుకున్నారు ప్రజలు. అయితే.. కొందరు మాత్రం సొంతూళ్లకు వెళ్దామనుకున్నా.. ఏపీకి వెళ్లేందుకు బస్సులు కరువయ్యాయి. అడపా దడపా ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసులు నడిపిస్తున్నా.. ఆర్టీసీ బస్సులు మాత్రం నడవడం లేదు.

ఏపీ, తెలంగాణ మధ్య బస్సుల విషయంలో అగ్రిమెంట్ కొలిక్కి రాకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. అయితే.. సమస్యకు ఓ పరిష్కారం చూపించింది ఏపీ సర్కారు. రాష్ట్ర సరిహద్దు నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించారు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని.

ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్‌, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టుల దగ్గర బస్సులు రెడీగా ఉన్నాయని చెప్పారు. ప్రయాణికులు సరిహద్దు దగ్గరకు వస్తే చెక్‌పోస్టుల దగ్గర సరిపడినన్ని బస్సులున్నాయన్నారు.

ఏపీకి వెళ్లాలనుకునే వారికోసం సరిహద్దు వరకు బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీని కోరారు నాని. ప్రయాణికులను సరిహద్దు నుంచి వారి గమ్య స్థానాలకు చేరుస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్ణాటక, తమిళనాడుకు బస్సుల పునరుద్ధరణ ఇప్పటికే జరిగిందన్నారు. తెలంగాణకు సర్వీసులు నడిపే విషయంలో చర్చలు కొలిక్కి రాలేదన్నారు. జూన్‌ 18 నుంచి అక్కడి అధికారులతో ఏపీ అధికారులు చర్చిస్తున్నారని మంత్రి చెప్పారు. కనీసం పండగవరకైనా బస్సులు నడపాలని తెలంగాణ అధికారులను కోరామని.. అయినా బస్సులు నడపడం లేదన్నారు.

మంగళవారం రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మరోసారి భేటీ అయ్యే ఛాన్స్ ఉందన్నారు నాని. TSRTC అధికారులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం జరిగే భేటీలో బస్సులు నడిపేందుకు నిర్ణయం తీసుకుంటే.. పండక్కి వెళ్ తిరిగి వచ్చే వారికి కాస్త వెసులుబాటు ఉంటే అవకాశముంది.

Next Story
Share it