Top
Batukamma

మాజీ సీఎం తమ్ముడికి చంద్రబాబు కీలక పదవి..!

మాజీ సీఎం తమ్ముడికి చంద్రబాబు కీలక పదవి..!
X
Highlights

ఏపీ ప్రభుత్వాన్ని మరింత సమర్థవంతగా ఎదుర్కొనేందుకు 219 మందితో కూడిన రాష్ట్ర కమిటీని టీడీపీ ఇవ్వాళ ప్రకటించింది.

ఏపీ ప్రభుత్వాన్ని మరింత సమర్థవంతగా ఎదుర్కొనేందుకు 219 మందితో కూడిన రాష్ట్ర కమిటీని టీడీపీ ఇవ్వాళ ప్రకటించింది. ఇందులో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, కోశాధికారి ఉన్నారు.

కమిటీలో బడుగు, బలహీన, ఎస్సీలకు 61 శాతం పదవులు ఇచ్చినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇందులో మహిళలలకు కూడా ప్రాధాన్యం లభించింది..

అయితే ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ కి కీలకమైన పదవిని అప్పగించారు చంద్రబాబు.. ఆయనకి బాబు సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రెటరీ గా నియమించారు.

చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి మంచి పేరుంది.. కిషోర్ కుమార్ తండ్రి అమర్ నాథ్ రెడ్డి ...మంత్రిగా పనిచేశారు.. అన్నయ్య కిరణ్ కుమార్ రెడ్డి అదృష్టం బాగుండి స్పీకర్ నుంచి సీఎం అయ్యారు..

రాష్ట్ర విభజన తర్వాత అన్నయ్య కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పీలేరు నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు కొషోర్ కుమార్.

అయితే ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీలో కిషోర్ కుమార్ చేరారు. తమ్ముడు వచ్చాక అన్నయ్య కూడా ఎలాగూ వస్తాడులే అనుకుంది టీడీపీ.. టీడీపీలో చేరగానే కిషోర్ కుమార్ కి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది టీడీపీ..

చిత్తూరులో టీడీపీ మరింతగా బలపడుతుంది అనుకున్న టీడీపీకి గత ఎన్నికల్లో బాబు తప్ప అందరూ అక్కడ ఓడిపోయారు.. అయితే పార్టీనే నమ్ముకొని ఉన్న కొందరికి ఉన్నంత పదవులు ఇచ్చి పార్టీకి జవసత్వాలు నింపే పనిపెట్టుకున్నారు బాబు.. అందులో భాగంగానే కిషోర్ కుమార్ రెడ్డి కి కీలక పదవిని కట్టబెట్టారు బాబు..

Next Story
Share it