Top
Batukamma

వాకింగ్ కు వెళ్లి రక్తపు మడుగులో పెళ్లికొడుకు.. చేసిందెవరో తెలిస్తే షాక్ అవుతారు..!

వాకింగ్ కు వెళ్లి  రక్తపు మడుగులో పెళ్లికొడుకు.. చేసిందెవరో తెలిస్తే షాక్ అవుతారు..!
X
Highlights

ఇద్దరి తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించారు. ఈ నెల 8న పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారు. బంధువులు కూడా వస్తున్నారు.

ప్రేమ పెళ్లిళ్ల కారణంగా చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నా.. తమ పరువు తీశారని.. వారి ప్రాణాలు తీస్తున్నారు.అయితే.. కర్నూలు జిల్లాలో మరో దారుణం జరిగింది. ఈ ఘటనతో కర్నూలు జిల్లా మొత్తం షాక్ అయ్యింది.

ఆ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. శుభలేఖలు కూడా పంచారు. అబ్బాయిని పెళ్లి కొడుకును చేయడానికి అంతా సిద్ధమవుతున్నారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు. వాకింగ్ కి వెళ్లిన పెళ్లి కొడుకు రక్తమడుగులో కనిపించాడు.

ఈ ఘటనపై ఎంక్వైరీ మొదలు పెట్టిన పోలీసులు అసలు నిజం తెలుసుకుని షాక్ అయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన నందికుంట శ్రీనివాసులు ఆచారి కుమారుడు హర్షవర్ధన్ కర్ణాటకలోని గుల్బర్గాలో అతడు బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాడు. 2 ఏళ్లుగా అనంతపురం జిల్లా కదిరికి చెందిన మౌనిక అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.

ప్రేమ విషయం ఇద్దరి తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించారు. ఈ నెల 8న పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారు. బంధువులు కూడా వస్తున్నారు.

ఇదే టైంలో ఓ షాకింగ్ న్యూస్.. తండ్రితో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్లిన హర్షవర్ధన్ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కర్నూలులోకి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులకు విస్తుపోయే విషయం తెలిసింది. హర్షవర్ధన్ పై హత్యాయత్నం చేసింది అతడి కన్నతండ్రి శ్రీనివాసులు ఆచారి అని గుర్తించారు. కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో.. ఈ దారుణానికి ఒడిగట్టినట్టు విచారణలో తేలింది.

బలవంతంగానే పెళ్లికి ఒప్పుకున్న శ్రీనివాసులు ఆచారి.. కొడుకుప కక్ష పెంచుకుని ఏకంగా అతడిని హత్య చేసేందుకు వెనుకాడలేదు. అయితే.. తీవ్ర గాయాలతో ప్రస్తుతం హర్షవర్ధన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.

Next Story
Share it