Top
Batukamma

చంద్రబాబు NTRకి చేసింది వెన్నుపోటా!!

చంద్రబాబు NTRకి చేసింది వెన్నుపోటా!!
X
Highlights

తమ నాయకుడిగా ఎన్నుకుంటారో అతడే ముఖ్యమంత్రి అవుతాడు..ఇది కూడా చట్టబధ్ధమే..!!

1.డెమోక్రసీ లో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని దించేసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే జనరల్ సెక్రటరీ గాని ట్రెజరర్ గాని రాష్ట్ర కార్యవర్గం కాని ఆయన మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని 2/3 మెజార్టీ తో ఆమోదిస్తే అధ్యక్షుడు దిగిపోతాడు..తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు..!!

ఇది చట్టబధ్ధమైన ఎన్నిక..!!

2.ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలంటే శాసన సభలో ఉన్న మొత్తం MLAలలో సగం కంటే ఎక్కువ మంది MLA లు ఎవరినైతే తమ నాయకుడిగా ఎన్నుకుంటారో అతడే ముఖ్యమంత్రి అవుతాడు..ఇది కూడా చట్టబధ్ధమే..!!

ఇలానే NTR గారిని పార్టీ అధ్యక్షుడిగా మరియు ముఖ్యమంత్రిగా దించేసారు..!!అయితే అలా చట్టబధ్ధంగా జరిగే క్రమానికి ముందు జరిగింది మాత్రం అనైతికం..!!కాని రాజకీయాలలో నైతిక విలువలకు,న్యాయానికి విలువ లేదు కాబట్టి అది తప్పు కాదని కవర్ చేసుకుంటారు..!!

TDLP నాయకుడి ఎన్నికకు ముందు రాజకీయపార్టీ లు గెలిచిన తమ MLAలతో ఒక సమావేశం పెట్టి అందులో తమ నాయకుడిని ఎన్నుకుని ఆ తీర్మానాన్ని గవర్నర్ కు ఇస్తాయి. అయితే NTR గారిని ఆ ఎన్నికకు పిలవకపోవడం తప్పు..!!!ఒక వేళ ఆయనని ఆ సమావేశం కంటే ముందే పార్టీ అధ్యక్షుడు సస్పెండ్ చేసుంటే పిలవనవసరం లేదు..!!

PS

ఇక NTRదే తెలుగుదేశం అనుకుని భ్రమించే వారు చాలా మందే ఉన్నారు.ఇక చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచాడని ఆయన పార్టీని మోసంతో లాక్కున్నాడని తిడుతుంటారు.కాని అది తప్పు.ఏ ఉద్యమ సంస్థ అయినా రాజకీయ పార్టీ అయినా NGO అయినా స్థాపించిన వాడి సొత్తు కాదు..అది కార్యవర్గానిదే అవుతుంది..!!

దాంట్లో ఉన్న సభ్యులకే చెందుతుంది.ప్రభుత్వం కుడా రాజకీయ పార్టీలకు ఇన్ కంటాక్స్ లో కాని ప్రభుత్వం నుండి నిధుల విషయంలో కాని ఎన్నికలప్పుడు ఖర్చుల విషయంలో కాని బిల్డింగ్ నిర్మాణం కోసం కాని ప్రజల నుండి విరాళాల సేకరణలో కాని చాలా ఎగ్జెంప్షన్స్ ఇస్తుంది.ఇవి వ్యక్తిగతమైనదే అయితే ఇన్ని సదుపాయాలుండవు.

చంద్ర బాబు NTR. కి చేసింది నైతికం కాదు కాని దానికి చట్టబధ్ధత ఉంటుంది.

బజార్లో మద్యం తాగితే నేరం. కాని బార్ లలో తాగొచ్చు.ఇది చట్టం.అసలు మద్యం తాగకపోవడమే నైతికం.

- Krishna Korivi

- LIE IS BELIEF: అబద్దమే నమ్మకం..!

- నాగార్జునాసాగర్ లో TRS పార్టీకి క్యాండిడేట్ దొరికేశాడు..!

- నిండుగా బట్టలేసుకున్న అనసూయ.. హార్ట్ అయిన ఫ్యాన్స్!

- అల్టిమేట్ ఫిగర్ ను సెట్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ .. ఈ హాట్ బ్యూటి ఎవరంటే..?

Next Story
Share it