Top
Batukamma

బీజేపీ కంటే జనసేననే బెటర్...!

బీజేపీ కంటే జనసేననే బెటర్...!
X
Highlights

అయితే ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలవగా, టీడీపీ, జనసేన మద్దతుదారులు ఆ తరవాతి స్థానంలో నిలిచారు.

ఏపీలో సక్సెస్ ఫుల్ గా మూడు విడతల పంచాయితీ ఎన్నికలు జరిగిపోయాయి. ఇందులో కొన్ని ఏకగ్రీవాలు ఉన్నాయి.. అయితే ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలవగా, టీడీపీ, జనసేన మద్దతుదారులు ఆ తరవాతి స్థానంలో నిలిచారు.

అయితే బీజేపీ మాత్రం పట్టుమని పది స్థానాలు కూడా గెలవలేదు. దీనితో బీజేపీ కంటే జనసేన బెటర్ అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయితీ ఎన్నికల పైన బీజేపీ పెద్దగా ఫోకస్ చేయలేదని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు.

అయితే ఇవి పంచాయితీ ఎన్నికలు కాబట్టి బీజేపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటిచేశాయి. ఇక తిరుపతి ఉపఎన్నికల్లో కలిసే పోటిచేస్తాయని ముందునుంచి ఉహాగానాలు వస్తున్నాయి.

అయితే పంచాయితీ ఎన్నికలు ఫలితాల తర్వాత బీజేపీ మద్దతు ఇస్తూ జనసేన బరిలో ఉండాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Next Story
Share it