Top
Batukamma

పవన్.. జనసేనను ఇంకెన్ని రోజులు అద్దెకిస్తారు..?

పవన్.. జనసేనను ఇంకెన్ని రోజులు అద్దెకిస్తారు..?
X
Highlights

“ప్రశ్నిస్తా”.. అనే నినాదంతో వచ్చిన పవన్.. ఇప్పుడు కేవలం “మద్దతిస్తా..” అనే నినాదానికే పరిమితం అయ్యారనే విమర్శలున్నాయి.

PAWAN KALYAN: ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్ కి అన్ని పార్టీలకు మద్దతు ఇవ్వడానికి టైమ్ సరిపోతోంది. సరిగ్గా 2014లో పార్టీ పెట్టిన పవన్, ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనుభవంలో ఉన్న టీడీపీకి, అప్పుడే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్న బీజేపీకి సపోర్ట్ ఇచ్చాడు. ఆ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయి.

ఇక గతేడాది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ లను పక్కన పెట్టేసి సీపీఐ, సీపీఎం, బీఎస్పీ లకి మద్దతు ఇస్తూనే పోటీ చేశారు పవన్. ఆ ఎన్నికల్లో జనసేన భారీ ఓటమి పాలయింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిన పవన్.. మళ్లీ పార్టీని బలోపేతం చేసేందుకు కొద్దిగా ఫోకస్ చేశారు.


కరోనా లాంటి విపత్కరమైన సమయంలో ప్రజలోకి వెళ్లి చాలా సహాయం చేశారు జనసేన శ్రేణులు. కరోనా వారియర్స్ ను ఎంకరేజ్ చేస్తూ ధన్యవాదాలు తెలిపాడు. ఫ్యాన్స్ ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. పాలిటిక్స్ లోనూ కనిపిస్తూ వచ్చారు.

ఇలాంటి టైంలోనే తెలంగాణలో GHMC ఎన్నికలు వచ్చాయి. ముందుగా తెలంగాణలో తాము కూడా పోటీ చేస్తామని చెప్పారు పవన్. అభ్యర్థులు నామినేషన్లు కూడా వేశారు.

READ ALSO:

- డోంట్ మిస్. హైదరాబాద్ లో ఓటు ఉంటే.. .అన్నీ ఫ్రీ.. !!

- వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర

- ఉచితంగా కరోనా టీకాలు.. మహిళలలకి మెట్రోలో ఉచిత ప్రయాణం!

- అనసూయ టాప్ 10 హాట్ పిక్స్!


అయితే ఇక్కడే బీజేపీ తమ అసలైన రాజకీయాన్ని ప్రదర్శించింది. దుబ్బాకలో గెలిచి గ్రేటర్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న బీజేపీకి జనసేన తోడైతే బాగానే ఉంటుంది. కానీ విడివిడిగా పోటీ చేస్తేనే నష్టం వస్తుంది. తెలంగాణలో ఎలాగూ జనసేనకి పట్టు లేదు. ఒక్క డివిజన్ లో గెలవడం కూడా కష్టమే.

అలాగని జనసేనను లైట్ తీసుకోలేదు బీజేపీ. పవన్ ఫ్యాన్స్ జనసేనకు ఓటేస్తే.. కొన్ని ఓట్లు చీలిపోయే ప్రమాదముంది. ఆ ఓట్లు కూడా బీజేపీకే పడాలంటే పవన్ మద్దతు ఉండాలి. జనసేన ఎన్నికల బరిలో ఉండొద్దనే ఉద్దేశంతోనే.. పవన్ కల్యాణ్ తో బీజేపీ నేతలు చర్చలు జరిపారని తెలుస్తోంది.

అటు దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు మరింత జోష్ ని ఇవ్వడంతో తిరుపతి పార్లమెంట్ ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తోంది బీజేపీ. దుబ్బాక సీన్ ని రిపీట్ చేయాలని చూస్తోంది. అక్కడ ఈ ఒక్క సీటు గెలిచి వైసీపీకి పోటీగా నిలబడాలని పావులు కడుపుతోంది.


అయితే.. అన్ని చోట్ల బీజేపీకి మద్దతుగా వెళ్తున్న పవన్ కల్యాణ్.. తిరుపతి ఎంపీ సీటు మాత్రం తమకు వదిలేయాలని బీజేపీ అధిష్టానాన్ని కోరినట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉన్న పవన్ కల్యాణ్.. ఇదే విషయంపై బీజేపీ పెద్దలతో మాట్లాడారని టాక్.

కానీ బీజేపీ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. అక్కడ కూడా పవన్(PAWAN KALYAN) పార్టీని సపోర్టింగ్ క్యారెక్టర్ గానే ఉంచేసింది. తామే ఎన్నికల బరిలో ఉంటామని.. మద్దతివ్వాలని పవన్ కు చెప్పి పంపించేసింది. ఇదే సమయంలో మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ.

తిరుపతిలో పోటీ నుంచి తప్పుకోవడంపై త్వరలోనే జనసేన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని సమాచారం.

త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జరగబోతున్నాయి. అయితే.. ఆ ఎన్నికల్లో అయినా జనసేన పార్టీ పోటీ చేస్తుందా..? లేకపోతే అక్కడ కూడా మళ్లీ బీజేపీకే మద్దతిచ్చి సైలెంట్ అయిపోతుందా..? అనేది ఇప్పుడు మరో ప్రశ్న.అయితే.. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చెప్పిన మాటలు వేరు. ఇప్పుడు చేస్తున్నది వేరు. "ప్రశ్నిస్తా".. అనే నినాదంతో వచ్చిన పవన్.. ఇప్పుడు కేవలం "మద్దతిస్తా.." అనే నినాదానికే పరిమితం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఇలా చేస్తూ ఉన్న కాస్త క్రెడిబులిటీని కూడా పవన్ కోల్పోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తల్లో కూడా ఓపిక నశించిపోయినట్టు కనిపిస్తోంది. పార్టీ పెట్టాక.. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాసేవ చేయాలని చాలామంది పవన్ వెంట నడుస్తున్నారు. అలాంటి వారందరికి ఇప్పుడు నిరాశే మిగులుతోంది. ఎంతసేపు పొరుగు పార్టీలకు మద్దతివ్వడం తప్పితే.. మనం పోటీ చేసేది ఎప్పుడని.. కిందిస్థాయి నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట కార్యకర్తలు.

Next Story
Share it