Top
Batukamma

Kakinada : కారుతో తొక్కి.. తొక్కి.. చంపేశారు.. కాకినాడలో దారుణం

Kakinada councellor murder
X
Highlights

కారుతో గుద్ది అత్యంత పాశవికంగా రమేష్ ను హత్య చేశారు. చిన్న తన కారుతో మొదట రమేష్ ను గుద్దాడు.

కాకినాడలో దారుణం జరిగింది. కార్పొరేటర్ ను అతి దారుణంగా చంపేశారు ప్రత్యర్థులు. అందరూ చూస్తుండగానే ఈ దారుణ ఘటన జరిగింది.

కార్పొరేటర్ కంపర రమేష్ కాకినాడలోని ఆర్టీవో ఆఫీసు దగ్గర అతి దారుణంగా చంపేశారు. నిన్న అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రమేష్‌ ను వెంటనే హాస్పిటల్ కు తరలించినా.. అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు.

కార్పొరేటర్ రమేష్ ను ఎండోమెంట్ కాలనీకి చెందిన గురజాల చిన్న.. హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. గురజాల చిన్న ... నిన్న రాత్రి రమేష్ ను మందు పార్టీకి పిలిచాడు. రమేష్ బిజీగా ఉన్నానని చెప్పినా.. చాలాసార్లు ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చాడు.

కాకినాడ రూరల్ గంగరాజు నగర్ రోడ్డు నంబరు 9 దగ్గరున్న సూర్య వాటర్ సర్వీసింగ్ సెంటర్ లో అంతా కలిసి మందు పార్టీ చేసుకున్నారు. గురజాల చిన్న, అతని సోదరుడు కుమార్ కూడా ఆ పార్టీకి హాజరయ్యారు. రమేష్ తనతో పాటు.. వాసు, సతీష్ ను తీసుకుని వచ్చాడు.

ఫుల్లుగా తాగిన తర్వాత రమేష్ కు చిన్నాకు మధ్య గొడవ మొదలైంది. ఇది కాస్త తీవ్రంగా మారడంతో కారుతో గుద్ది అత్యంత పాశవికంగా రమేష్ ను హత్య చేశారు. చిన్న తన కారుతో మొదట రమేష్ ను గుద్దాడు.

తర్వాత రెండు సార్లు కారు రివర్స్ తీసుకుని మరీ అతడిని తొక్కించాడు. దీంతో రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలు పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.



Next Story
Share it