భుజాల పైన శవాన్ని మోసి.. మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సై !

శ్రీకాకుళంజిల్లాలో ఓ మహిళా ఎస్.ఐ మానవత్వం చాటుకున్నారు. గుర్తుతెలియని శవాన్ని మోసి దనహసంస్కారాలు నిర్వహించారు.
శ్రీకాకుళంజిల్లాలో ఓ మహిళా ఎస్.ఐ మానవత్వం చాటుకున్నారు. గుర్తుతెలియని శవాన్ని మోసి దనహసంస్కారాలు నిర్వహించారు. కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో అడవికొత్తూరు గ్రామంలో ఓ గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్ ఐ శిరీష.. డెడ్ బాడీని స్వయంగా కిలోమీటర్ దూరం వరకు మోసుకొచ్చారు. కోసంగిపురం జంక్షన్ వద్ద ఉన్న లలితా చారిటబుల్ ట్రస్టు వారితో మాట్లాడి ఆ డెడ్ బాడీకి దహన సంస్కారాలు నిర్వహించారు. ఓ మహిళా ఎస్ ఐ అనాథ శవాన్ని మోసి, దహన సంస్కారాలు నిర్వహించడంతో స్థానికులు అభినందిస్తున్నారు.
AP Police cares: DGP Gautam Sawang lauds the humanitarian gesture of a Woman SI, K.Sirisha of Kasibugga PS, @POLICESRIKAKULM as she carried the unknown dead body for 2 km from Adavi Kothur on her shoulders & helped in performing his last rites.#WomanPolice #HumaneGesture pic.twitter.com/QPVRijz97Z
— Andhra Pradesh Police (@APPOLICE100) February 1, 2021