వకీల్ సాబ్ కాదు.. షకీలా సాబ్.. కొడాలి నాని పంచ్ డైలాగులు

వలింగం ఎవరో, బోడిలింగం ఎవరో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించారు.
నిన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. పంచ్ డైలాగులతో పవన్ పై విరుచుకుపడ్డారు.
ఆ పంచ్ డైలాగులు యాజిటీజ్ గా మీకోసం.
..
శివలింగం ఎవరో, బోడిలింగం ఎవరో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శివలింగం కాబట్టే రాష్ట్ర ప్రజలు నెత్తిమీద పెట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బోడిలింగం కాబట్టే గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేసారు.
మంత్రిగా రాష్ట్ర ప్రజలకు,గెలిపించిన గుడివాడ ప్రజలకు తాను సమాధానం చెప్పాలి ప్యాకేజీలు తీసుకొని మాట్లాడే యాక్టర్ ల కు కాదు.
విజయవాడ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పేకాట క్లబ్ లు నిర్వహించిన చరిత్ర చంద్రబాబు, అతని పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ది.
రాష్ట్రంలో , గుడివాడ లో పేకాట క్లబ్ లను ముయించిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ది,తనది.
ప్యాకేజీలు తీసుకొని మాట్లాడే పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలి.
పవన్ కళ్యాణ్ ను సినిమాలు మానేయమని ఎవరూ చెప్పలేదు, ఆయన సినిమాల్లో ఉన్న రాజకీయాల్లో ఉన్న ఒకటే.
దత్తపుత్రుడు, సొంత పుత్రుడు తో చంద్రబాబు రాజకీయాలు చేస్తే రాలేది బూడిదే తప్ప ప్రయోజనం ఉండదు.
ఒక రాజకీయ పార్టీతో ఇంత స్థాయిలో వ్యాపారం చేయొచ్చని చూపించిన ఆదర్శపురుషుడు పవన్ కళ్యాణ్.
వకిల్ సాబ్ చెప్పాడని , జగన్ కు చెప్పాలన్న పవన్ కళ్యాణ్ ను ప్రజానీకం షకీలా సాబ్ అనుకుంటున్నారు.
ముఖ్యమంత్రి కి పనికిమాలిన సూచనలు యాక్టర్ లు ఇవ్వాల్సిన అవసరం లేదు.
అవసరమైతే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని బోడిలో లింగం పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడవచ్చు.
అసెంబ్లీ లోపలికిరా లేకే రైతుల పేరుతో అసెంబ్లీని ముట్టడిస్తాఅనడం పనికిమాలిన చర్య.
ప్రజల మనోభావాలతో గెలుస్తున్న తనను, పేర్ని నాని, ఆల్ల నాని లను బోడి లింగాలనడం సిగ్గుమాలిన చర్య.
పవన్ కళ్యాణ్ ది జనసేన పార్టీ కాదు, తెలుగు సేనా శాంతి పార్టీ.
ప్యాకేజీలు తీసుకొని రోడ్ల మీదకు వచ్చి మెడ,తొడ రద్దు కుంటే ప్రజలు నమ్మరు.
రైతుల పేరుతో డ్రామాలు, నాటకాలు ఆడితే ప్రజలు విశ్వసించరు, పవన్ కళ్యాణ్ కు చేతనైన ది చేయ్.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కే ఏ పాల్ లాంటి పనికిమాలిన వాళ్ళు ఎంతమంది కలిసిన, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాళీ చిటికెన గోరు కూడా కదప లేరు.
- ఆ వంద మంది మన మధ్యే ఉన్నారు.. బీ కేర్ ఫుల్.. లేకుంటే అంతే..!