Top
Batukamma

మదనపల్లె జంట హత్యలో భూతవైద్యుడు.. ఇంతకీ ఆ అమ్మాయిల చెవిలో ఊదిందెవరు?

మదనపల్లె జంట హత్యలో భూతవైద్యుడు.. ఇంతకీ ఆ అమ్మాయిల చెవిలో ఊదిందెవరు?
X
Highlights

నాకు ఆ టైంలో ఇంటి పై అంతస్తులో ఓ అమ్మాయి అరుపులు వినిపించాయి. ఆ తర్వాత వాళ్ల అమ్మ తన దగ్గరికి వచ్చి తన పిల్లలకు మంత్రించాలని కోరింది.

మితిమీరితే ఏదైనా ప్రమాదమే... మితిమీరిన మూఢనమ్మకం ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసిన ఘటన తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది. పెళ్లీడుకొచ్చిన తన ఇద్దరు బిడ్డలను బలిచ్చారు తల్లిదండ్రులు పురుషోత్తంనాయుడు, పద్మజ .. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పుడు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.

తాజాగా ఘటన పైన స్థానికంగా ఉండే భూత వైద్యుడు సుబ్బరామయ్య మీడియాతో మాట్లాడారు. మీడియాతో అయన మాట్లాడుతూ... శనివారం ఉదయం సాయిచిత్ర భాస్కర్, రాజు అనే అన్నదమ్ములు తన దగ్గరికి వచ్చి తమ బంధువుల పిల్లలకు చాలా సీరియస్‌గా ఉందని చెప్పి పురుషోత్తం నాయుడు, పద్మజ ఇంటికి తీసుకొని పోయారు.


నాకు ఆ టైంలో ఇంటి పై అంతస్తులో ఓ అమ్మాయి అరుపులు వినిపించాయి. ఆ తర్వాత వాళ్ల అమ్మ తన దగ్గరికి వచ్చి తన పిల్లలకు మంత్రించాలని కోరింది. దీనితో నేను వారికి మంత్రించిన తర్వాత శ్రీ వెంకటరమణ స్వామి గుడి దగ్గర పూజా సామగ్రి, కొబ్బరి కాయలు, తాయత్తులు తీసుకొచ్చామని చెప్పింది.

తిరిగి వారి ఇంటికి వెళ్లే సరికి ఎవరో ఓ సన్నటి వ్యక్తి ఆ అమ్మాయిల దగ్గర కూర్చొని చెవిలో శంఖం ఊదడం నేను చూశాను. ఆ తర్వాత అక్కడినుండి నేను తిరిగి వచ్చాను. మంత్రించినందుకు గాను నాకు రూ.300 ఇచ్చారు.

ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని భూత వైద్యుడు సుబ్బరామయ్య వెల్లడించారు. దీనితో ఇప్పుడు ఈ కేసులో ఆ సన్నని వ్యక్తి ఎవరు అనే ఆలోచనలో పడ్డారు పోలీసులు.

Next Story
Share it