Top
Batukamma

సీఎం జగన్ కు చుక్కలు చూపించబోతున్న బండి సంజయ్!

సీఎం జగన్ కు చుక్కలు చూపించబోతున్న బండి సంజయ్!
X
Highlights

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది బీజేపీ.. ఇప్పటికే దుబ్బాకలో విజయం, గ్రేటర్ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు ఆ పార్టీలో ఎక్కడ లేని జోష్ ని తీసుకువచ్చాయి.

Tirupati By poll : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది బీజేపీ.. ఇప్పటికే దుబ్బాకలో విజయం, గ్రేటర్ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు ఆ పార్టీలో ఎక్కడ లేని జోష్ ని తీసుకువచ్చాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు చేప్పట్టిన తరవాత పార్టీ బలోపేతం పైన తనదైన ముద్ర వేస్తున్నారు.

సీఎం కేసీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ సవాళ్లు విసురుతున్నారు. అయితే బండి సంజయ్ సేవలను రెండు తెలుగు రాష్ట్రాలలో వాడుకోవాలని చూస్తుంది అధిష్టానం.. అందులో భాగంగానే త్వరలో తిరుపతిలో జరగబోయే ఉపఎన్నిక కోసం బండి సంజయ్ ని రంగంలోకి దింపనుంది.

మొదటగా బండి సంజయ్ తో ప్రచారం చేయించి ఉప ఎన్నికకు హైప్ తీసుకురావాలని బీజేపీ చూస్తోంది. జనవరి మొదటివారంలో బండి సంజయ్ తిరుపతి టూర్ ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.. మార్చిలో లేదా ఏప్రిల్ లో తిరుపతి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో ఎంఐఎంను టార్గెట్ చేసిన బీజేపీ.. ఏపీలో అధికార వైసీపీని టార్గెట్ చేయనుంది. రాష్ట్రంలో వైసీపీ మతమార్పిడి లని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ.. సీఎం జగన్ ను ఇరకాటంలో పెట్టెలా వ్యహరచన చేస్తున్నారు కమలనాథులు.. ఎన్నికల ప్రచారంలో తిరుపతి కొండపైన అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయనే అంశాలను ప్రచార అస్త్రాలుగా వాడుకొనున్నారు.

తాజాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు.. సీఎం జగన్ కి , వైసీపీ కార్యకర్తలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం పెద్ద చర్చకు దారీ తీసింది. వీటినే మెయిన్ హైలెట్ చేస్తూ బీజేపీ నేతలు ప్రచారం చేయనున్నారు. బండి సంజయ్ తర్వాత ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు లతో కూడా అధిష్టానం ప్రచారం చేయించనుందని టాక్.

అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీ రాజకీయాలు కాస్తా భిన్నంగా ఉంటాయి. మరి ఈ టాస్క్ లో తెలంగాణ బీజేపీ నేతలు ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది చూడాలి మరి !

Next Story
Share it