Top
Batukamma

ప్రకాష్ రాజ్... ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జాగ్రత్త!

ప్రకాష్ రాజ్... ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జాగ్రత్త!
X
Highlights

ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల పట్ల జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రకాష్ రాజ్ పైన ఆగ్రహం చేస్తున్నారు. తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ పైన పవన్ అన్నయ్య, జనసేన లీడర్ నాగబాబు స్పందించారు.

గ్రేటర్ ఎన్నికల జోరు ఇప్పుడు మాములుగా లేదు. కౌంటర్ కి కచ్చితంగా ఎన్ కౌంటర్ లు ఉంటున్నాయి. దీనితో నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు నటుడు ప్రకాష్ రాజ్.

గ్రేటర్ ఎన్నికల్లో ముందుగా పోటీ చేస్తానని చెప్పిన పవన్, ఆ తరవాత పోటీ నుంచి తప్పుకంటూ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే దీనిపైన ప్రకాష్ రాజ్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని అంటూ వ్యాఖ్యానించారు.

ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల పట్ల జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రకాష్ రాజ్ పైన ఆగ్రహం చేస్తున్నారు. తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ పైన పవన్ అన్నయ్య, జనసేన లీడర్ నాగబాబు స్పందించారు.

రాజకీయల్లో నిర్ణయాలు అనేక సార్లు మారుతుంటాయి. బట్ ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్ లో పార్టీ కి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ghmc ఎలక్షన్స్ లో బీజేపీ కి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకి కృషి చేయటం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయిని నా నమ్మకం.

ఎవడికి కళ్యాణ్ ద్రోహం చేసాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు.mr prakash raj నీ రాజకీయ డొల్లతనం ఏంటో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లొనే అర్థం అయ్యింది.సుబ్రమణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నీ ఉద్దేశ్యం లో బీజేపీ తీసుకొన్న నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించు తప్పులేదు.

అలాగే బీజేపీ గాని మరి ఏ పార్టీ గాని ప్రజలకు మంచిచేసినా హర్షించగలగాలి.విమర్శించటం తప్ప మంచి చేస్తే మేచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏమి చెప్పగలం.ఒకటి మాత్రం చెప్పగలను.ఈ దేశానికి బీజేపీ చెప్పగలం.ఒకటి మాత్రం చెప్పగలను.ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీ తో AP కి జనసేన పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం.

నీ లాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ జనసేన కూటమి శక్తిని ఆపలేరు.నిర్మాతలని ఎన్ని రకాలుగా డబ్బుకోసం హింస పెట్టవో, ఇచ్చిన డేట్స్ ని క్యాన్సల్ చేసి ఎంత హింసకి గురిచేసావో ఇంకా గుర్తున్నాయి ప్రకాష్ రాజ్. ముందు నువ్వు మంచి మనిషిగా తయారయ్యి అప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి మనిషి నిస్వార్థ పరుడైన నాయకుడిని విమర్శించు.

డైరెక్టర్స్ ని కాకా పట్టి నిర్మాతలని కాల్చుకు తిన్న నీకు ఇంతకన్నా మంచిగా మాట్లాడ్డం ఏమి తెలుసు. బీజేపీ నాయకత్వాన్ని నివ్వు నోటికొచ్చినట్లు విమర్శించినా నిన్ను ఎవరు ఏమి అనలేదంటే అది బీజేపీ democracy కు ఇచ్చే విలువ అని అర్థం చేసుకో. బీజేపీ జనసేన ghmc ఎలక్షన్స్ లో కచ్చితంగా తమ సత్తా చాటుకోబోతున్నాయి. మీడియా అడిగింది అని ఒళ్ళు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు" అని ట్వీట్ చేశారు నాగబాబు.Next Story
Share it