Top
Batukamma

Ys విజయమ్మ, షర్మిలకు షాకిచ్చిన నాంపల్లి కోర్టు!

Ys విజయమ్మ, షర్మిలకు షాకిచ్చిన నాంపల్లి కోర్టు!
X
Highlights

వైఎస్సార్ అకాల మరణంతో అప్పటివరకు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న కొండా సురేఖ మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే...

ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. 2012లో పరకాల ఉపఎన్నిక సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో నిబంధనలు ఉల్లంఘించిన కేసును విచారించారు.

వీరిద్దరితో పాటు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళీలపైన కూడా కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నలుగురు ఈ నెల 10న కచ్చితంగా హాజరుకావాల్సిందేనని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది.

వైఎస్సార్ అకాల మరణంతో అప్పటివరకు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న కొండా సురేఖ మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే... ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం పీక్స్ స్టేజిలో ఉపఎన్నికలు వచ్చాయి.

అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున పరకాల నుంచి పోటిలోకి దిగిన కొండా సురేఖ తరఫున వైఎస్ విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారానికి వచ్చారు. 2012 జూన్ 12 ఎన్నికల సభ నిర్వహించారు.

అయితే ఈ సభకు అనుమతి లేదని వైఎస్ విజయమ్మ, షర్మిల, కొండా సురేఖ, కొండా మురళిపై కేసు నమోదైంది. ఈ నెల 10 న కచ్చితంగా హాజరు కావాలని కోర్టు నోటీసులను జారీ చేసింది. అటు కొండా దంపతులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి విధితమే.

Next Story
Share it