Top
Batukamma

దివ్యది హత్యే.. ఫోరెన్సిక్‌ రిపోర్టులో అసలు నిజాలు!

దివ్యది హత్యే.. ఫోరెన్సిక్‌ రిపోర్టులో అసలు నిజాలు!
X
Highlights

విజయవాడ దివ్య తేజస్విని కేసులో రోజుకో ట్విస్ట్ ఏర్పడుతుంది. అయితే తాజాగా ఈ కేసులో నిందితుడు నాగేంద్రబాబు చెప్పిన దాంట్లో నిజం లేదని ఫోరెన్సిక్ నివేదిక అంటుంది.

విజయవాడ దివ్య తేజస్విని కేసులో రోజుకో ట్విస్ట్ ఏర్పడుతుంది. అయితే తాజాగా ఈ కేసులో నిందితుడు నాగేంద్రబాబు చెప్పిన దాంట్లో నిజం లేదని ఫోరెన్సిక్ నివేదిక అంటుంది. దివ్య శరీరం పైన ఉన్న గాయాలు సొంతంగా చేసినవి కావని ఫోరెన్సిక్ ఈ రిపోర్ట్ లో పేర్కొంది.

అసలు అందుకు అవకాశమే లేదని అంటుంది. నిందితుడు నాగేంద్రనే హత్య చేసినట్లుగా వైద్యాధికారులు నిర్ధారించారు. అయితే దీనికి ముందు తమ ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపకపోవడంతో ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, ఇందులో ఆమెను ఆమె కోసుకుందని, తనను తాను కోసుకున్నాన్నట్టుగా పోలిసుల విచారణలో వెల్లడించాడు నాగేంద్ర..

ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు చేసిన దిశా పోలీసులు తుది చార్జీషీటును రెడీ చేశారు. ఈ నెల 26 న కోర్టులో ఫిటిషన్లు దాఖలు చేయనున్నట్టుగా వెల్లడించారు. ఆసుపత్రి నుంచి నిందితుడు నాగేంద్ర డిశ్చార్జి కాగానే మరిన్ని విషయాలను రాబడుతామని పోలీసులు అంటున్నారు.

విజయవాడకి చెందిన దివ్య తేజశ్విని (22)ని బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్‌ చిన్నస్వామి కొద్దిరోజుల క్రితం కత్తితో దాడిచేసి చంపేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణలో భాగంగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం పోలీసులకి ఈ కేసు ఓ సవాల్ గా మారింది.

అటు బాధితురాలు కుటుంబ సభ్యులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. నిందితుడు నాగేంద్రకి శిక్ష పడేలా చేయాలనీ కోరారు.. అంతే కాకుండా తమ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు జగన్.. ఇక నాగేంద్రకు ఉరిశిక్ష పడేలా చూస్తామని హోంమంత్రి సుచరిత హామీ ఇచ్చారు.

Next Story
Share it