Top
Batukamma

ముంచుకొస్తున్న నివర్ తుఫాను.. అప్రమత్తమైన జగన్..!

nivar cyclone
X
Highlights

Nivar cyclone: నివర్ తుఫాను ముంచుకొస్తోంది. ఈ తుఫాను బుధవారం చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ...

Nivar cyclone: నివర్ తుఫాను ముంచుకొస్తోంది. ఈ తుఫాను బుధవారం చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడులోని చెన్నైతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రాబోయే 48 గంటల్లోగా నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. ఇది. తుఫానుగా మారి చెన్నై, మహాబలిపురం మధ్య తీరాన్నిదాటే అవకాశముంది. తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, చెట్లు కూలిపడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.



వీటి కారణంగా నాగపట్టినం, తిరువారూరు, తంజావూరు, శివగంగ, రామనాథపురం, పుదుకోట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పెరంబలూరు, తిరుచ్చి, కడలూరు, కళ్లకురిచ్చి, సేలం, మైలాడుతురై జిల్లాలో ఉరుమురులు, మెరుపులతో వానలు పడతాయన్నారు.

తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుఫాను నేరుగా ఏపీని తాకకపోయినా, తమిళనాడుకు చేరువలోనూ, సముద్ర తీర ప్రాంతాలలోనూ దాని ప్రభావం ఉంటుందన్నారు. అయితే రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు.

దీంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో 11–20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ చెప్పిందన్నారు సీఎం.


దీంతో పంటలు దెబ్బతినకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం చేరవేయాలన్నారు. కోతకు వచ్చిన పంటను ఎలా రక్షించుకోవాలో వారికి సూచించాలన్నారు. అలాగే ప్రాణ,ఆస్తి నష్టం జగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి ఉన్నందున్న మళ్లీ వర్షాలు పడితే వాటికి గండ్లు పడే అవకాశం ఉందన్నారు సీఎం. చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూం(nivar cyclone) ఉండాలని ఆదేశించారు.

- బ్రాండ్ వాల్యూలో నంబర్ వన్ మోడీ.. సెకండ్ ప్లేస్ లో వైఎస్ జగన్.

- ఆరోగ్యానికి అరటి.. ఎన్ని పోషకాలో..

Next Story
Share it