క్రిమినల్ కేసులున్న వైఎస్ జగన్ ను పీకేయండి.. సుప్రీంకోర్టులో పిటిషన్లు

జగన్ పైన 30 క్రిమినల్ కేసులు ఉన్నాయని, మనీలాండరింగ్ కేసులను సైతం జగన్ ఎదుర్కొంటున్నారని,
సీఎం పదవి నుంచి జగన్ ను తొలిగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.. ప్రముఖ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ ఈ దాఖలు చేశారు.. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై తప్పుడు ఆరోపణలు చేస్తూ జగన్ లేఖ రాశారంటూ వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
అంతేకాకుండా అటు జగన్ పైన 30 క్రిమినల్ కేసులు ఉన్నాయని, మనీలాండరింగ్ కేసులను సైతం జగన్ ఎదుర్కొంటున్నారని, అలాంటి వ్యక్తి న్యాయవ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తానరంటూ ఆ పిటిషన్ లో వారు ఆరోపించారు.. ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న అత్యంత సీనియర్ జడ్జిపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని వారు అన్నారు..
సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం చేస్తున్నారని ఆరోపించారు.. ఇలాంటి ఆరోపణల చేసి ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీయడమేనని అన్నారు.
దీనిపైన వెంటనే జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వారు కోర్టును కోరారు.. ఇక ఈ పిటిషన్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ, సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు.