Top
Batukamma

సినీ ఫక్కీలో ఛేజింగ్.. కిడ్నాపైన డాక్టర్ సేఫ్..!

సినీ ఫక్కీలో ఛేజింగ్.. కిడ్నాపైన డాక్టర్ సేఫ్..!
X
Highlights

రాజేంద్రనగర్ లో కిడ్నాపైన డాక్టర్ ను సేవ్ చేశారు పోలీసులు. అనంతపురంలో నిందితులను వెంబడించి మరీ పట్టుకున్నారు.

Rajendranagar Dentist : హైదరాబాద్ లో కిడ్నాపైన డాక్టర్ ను పోలీసులు కాపాడారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లోని ఎక్సైజ్ అకాడమీ దగ్గర మంగళవారం నాడు ఓ డెంటిస్ట్ కిడ్నాప్ అయ్యాడు. బురఖాలో వచ్చిన నిందితులు డాక్టర్ ను కిడ్నాప్ చేసి ఇన్నోవా కారులో తీసుకెళ్లారు.

కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. వారు బెంగళూరు హైవేపై వెళ్తున్నట్టు గుర్తించారు. సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇవాళ ఉదయం కిడ్నాపర్లు అనంతపురం జిల్లా మీదుగా వెళ్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

అనంతపురం పోలీసులు అలర్ట్ అయ్యారు. రాప్తాడు పోలీసులు కిడ్నాపర్ల వాహనాన్ని గుర్తించి.. నిందితులను వెంబడించారు. చివరకు నిందితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.


డాక్టర్ ను సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. డాక్టర్ ను చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి కారులో వెనకభాగంలో పడేశారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఆయనకు మత్తు మందు కూడా ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే.. మరో ఇద్దరు నిందితులు పరారైనట్టు పోలీసులు చెబుతున్నారు. వారి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి డమ్మి రివాల్వర్, మత్తు ఇంజెక్షన్ స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ను (Rajendranagar Dentist) బెంగళూరు తీసుకెళ్లేందుకు నిందితులు ప్రయత్నించినట్టు పోలీసుల విచారణ తేలింది.

- తగ్గుతున్న బంగారం.. పెరుగుతున్న వెండి ధర

- మూడు ముళ్లకు ఒప్పుకోలేదని నాలుగు కత్తిపోట్లు..!

- సానియా మీర్జా ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం..!

Next Story
Share it