Top
Batukamma

ఓహో.. అదా సంగతి..! అక్కడి నుంచి మొదలెట్టారా.. నరుక్కురావడం..?

ఓహో.. అదా సంగతి..! అక్కడి నుంచి మొదలెట్టారా.. నరుక్కురావడం..?
X
Highlights

ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో కృష్ణంరాజు కొన్ని రోజులు రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు.

Reason behind krishnam raju governor post: సినీ నటుడు, బీజేపీ సీనియర్ నేత కృష్ణంరాజు(krishnam raju)కి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయనని తమిళనాడు గవర్నర్ గా నియమించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేనప్పటికీ.. సోషల్ మీడియాలో ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుండడంతో పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. అటు ప్రభాస్ అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.

చాలా కాలం నాటి నుంచి కృష్ణంరాజు బీజేపీ(bjp)లోనే ఉన్నారు.. ముందుగా 1998లో కాకినాడ(Kakinada) నుంచి లోక్ సభకు ఎన్నికైన కృష్ణం రాజు, ఆ తరవాత 1999లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో 2000 సంవత్సరంలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా భాద్యతలు చేపట్టారు.

అయితే 2009లో బీజేపీని కాదని, మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో కృష్ణంరాజు కొన్ని రోజులు రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు.


ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో చేరి కాస్తా యాక్టివ్ అయ్యారు. అయితే గవర్నర్‌ కావాలనేది ఆయన చిరకాల కోరికను త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రూపంలో రానుంది. జరగబోయే తమిళనాడు(tamilnadu assembly elections) అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తున్న బీజేపీ.. కృష్ణంరాజును గ‌వ‌ర్న‌ర్‌గా పంపాల‌ని చూస్తోంది.

కాగా తమిళనాడుకు 2016లో రోశ‌య్య గవర్నర్ గా చేశారు. తర్వాత మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగ‌ర్ రావే కొద్ది రోజుల పాటు త‌మిళ‌నాడుకు కూడా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తిరు బన్వారిలాల్ పురోహిత్‌ ఆ రాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు.

అయితే కృష్ణంరాజును గవర్నర్ పదవి అనే చర్చ బీజేపీలో ఎప్పటినుంచో జరుగుతున్న చర్చే. కృష్ణంరాజు లాంటి సీనియర్ నేతకి, బీజేపీ గవర్నర్ పదవి ఆఫర్ చేస్తోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే విజయశాంతి, జీవితా రాజశేఖర్ లాంటి వాళ్ళు తిరిగి తమ సొంతగూటికి చేరుకోవడం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారింది. వీళ్లే కాదు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది సెలబ్రిటీలు.. మరీ ముఖ్యంగా గతంలో బీజేపీతో టచ్ లో ఉన్నవాళ్లు ఇప్పుడు మళ్లీ అందులోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.


బీజేపీ కూడా ఇదే ప్లాన్ తో సరిగ్గా ఇప్పుడు కృష్ణం రాజుకు గవర్నర్ పదవి ఇవ్వాలనే ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ బలం.. బలగం పెంచే పనిలో బీజేపీ బిజీగా ఉంది. ఇలాంటి టైంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెలబ్రిటీలను తమ వైపు లాగేసుకోవడానికి కృష్ణం రాజును ఓ ఎరలాగా వాడారనే ప్రచారమూ లేకపోలేదు. కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. కాబట్టి.. వాళ్లు తలుచుకుంటే ఏదో రకంగా తమను సెటిల్ చేసేస్తారని.. చాలా మంది సెలబ్రిటీలు అనుకుంటున్నారట.

అంతేకాకుండా కృష్ణంరాజుకు గవర్నర్ పదవి ఇచ్చి.. ప్రభాస్ అభిమానులను కూడా బీజేపీ వైపు టర్న్ అయ్యేలా ఆ పార్టీ ప్లాన్ వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it