Top
Batukamma

వైఎస్ జగన్ కు ఎవరూ ఊహించని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన రోజా..!

వైఎస్ జగన్ కు ఎవరూ ఊహించని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన రోజా..!
X
Highlights

ఇలా ఎవరికి తోచిన విధంగా వారు జగన్ బర్త్ డే సందర్భంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.

Roja birthday gift for YS Jagan mohan reddy:ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(ys jagana mohan reddy) జన్మదినం. ఈ సందర్భంగా చాలా మంది చాలా రకాల గిఫ్ట్ లు ఇస్తున్నారు. కొందరు పేపర్లలో యాడ్స్ ఇస్తే.. మరికొందరు సీఎం సహాయనిధికి విరాళాలిస్తున్నారు.

ఇలా ఎవరికి తోచిన విధంగా వారు జగన్ బర్త్ డే సందర్భంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.

అయితే.. ఎమ్మెల్యే రోజా(roja selvamani) మాత్రం.. ఓ గొప్ప పని చేశారు. అయినవాళ్లందరిని కోల్పోయిన ఓ చిన్నారికి కొత్త జీవితాన్నిచ్చారు. చిన్నారి దత్తత తీసుకున్నారు. దీనిపై ఆమె సంతోషం ఆమె మాటల్లోనే...


"మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..!

మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది.

పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి తన బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది కానీ డాక్టర్ అవ్వాలనే తన ఆశయాన్ని మాత్రం వదులుకోలేదు. మన పిల్లలు చదువుకోవాలి అందులోనూ మరి ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల తప్పనిసరిగా విద్యాపరంగా ఎదగాలి అని నమ్మే జగనన్న జన్మదినం సందర్భంగా ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది.


మనకు నచ్చిన వారి పుట్టిన రోజున కేవలం బొకేలు ఇవ్వకుండా ఒక బంగారు తల్లి భవిష్యత్తుకి బాట వెయ్యడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతోమంది చిన్నారులకు మేనమామగా మారిన మన జగనన్నకు ఇదే నా పుట్టినరోజు బహుమతి.. హ్యాపీ బర్త్ డే జగనన్న ."








- Horoscope Telugu:21-12-2020 సోమవారం నేటి రాశిఫలాలు

- ఇప్పటికింకా నా వయసు పదిహేనేళ్లే అంటున్న తమన్నా

- కాబోయే భర్తతో కలిసి చిందేసిన సింగర్ సునీత..


Next Story
Share it