శుభవార్త : 40 రూపాయలకే కిలో ఉల్లి

onion
ఇప్పుడు కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుంది. భారీ వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గడంతో ఉల్లి ధరలు కొండెక్కాయి.. దీనితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పుడు కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుంది. భారీ వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గడంతో ఉల్లి ధరలు కొండెక్కాయి.. దీనితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. ఉల్లికి డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు మరింతగా పెరిగే క్రమంలో ధరలను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల రైతు బజార్లలో రేపటినుంచి సబ్సీడీ ధర పైన ఉల్లిపాయలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోల్ సెల్ మార్కెట్లలో ఉల్లిని కొనుగోలు చేసే ప్రజలకు తక్కువ ధరకే అందించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉల్లి ధర మార్కెట్ లో రూ.100 పలుకుతుండగా, రైతు బజార్లలో రూ.40 కి అమ్మేలా ఏర్పాట్లు చేస్తోంది.
రెండోదశలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని రైతు బజార్లలో ఉల్లి సబ్సిడీ ధరకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే అయితే ఒక్కొకరికి ఎన్ని కేజీలు అమ్ముతారు అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇక గత ఏడాది అమ్మిన రేటు కంటే ఇది అధికం కావడం విశేషం.