Top
Batukamma

ఇవాళ్టి నుంచే సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీ

ఇవాళ్టి నుంచే సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీ
X
Highlights

శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతిలో ఇవ్వాల్టి నుండి స‌ర్వ‌ద‌ర్శ‌నం ...

శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతిలో ఇవ్వాల్టి నుండి స‌ర్వ‌ద‌ర్శ‌నం టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం ఉచిత స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లను తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్లలో జారీ చేస్తున్నారు.

రోజుకు 3 వేల చొప్పున టోకెన్లను ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి భక్తులకు అందించనున్నారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు జారీ చేస్తారు. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక రోజు ముందు టోకెన్లు ఇస్తారు.

టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ద‌ర్శ‌న టోకెన్లు క‌లిగిన భ‌క్తులను మాత్ర‌మే అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి తిరుమ‌లకు అనుమతిస్తారని టిటిడి ప్రకటించింది.

కరోనా కారణంగా రద్దైన సర్వదర్శనం టోకెన్ల జారీ.. ఎట్టకేలకు మొదలైంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. అయితే జులైలో తిరుపతిలోని కొన్ని ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించడంతో.. టోకెన్ల జారీ ప్రక్రియను నిలిపేశారు. జులై 21 నుంచి టోకెన్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది.

భక్తుల నుంచి విజ్ఞప్తులు రావడం, కరోనా తీవ్రత కూడా తగ్గడంతో ఇప్పుడు మళ్లీ టోకెన్ల జారీ ప్రక్రియ మొదలైంది. ఇక.. కరోనా నేపథ్యంలో ఆలయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నారు. టెంపరేచర్ చేశాకే భక్తులను ఆలయానికి అనుమతిస్తున్నారు.

భక్తుల సంఖ్యపైనా ఆంక్షలు పెట్టారు అధికారులు. భక్తులు గుమిగూడకుండా సీసీ కెమెరాల్లో ప్రత్యేక టెక్నాలజీ వాడి ఎప్పటికప్పుడు అనౌన్స్ మెంట్ చేస్తున్నారు.

Next Story
Share it