Top
Batukamma

SVBC ఆఫీసులో ఉద్యోగుల అశ్లీల కార్యకలాపాలు..!

SVBC ఆఫీసులో ఉద్యోగుల అశ్లీల కార్యకలాపాలు..!
X
Highlights

తిరుమల శ్రీవారి సన్నిధిలో పాడు పనులు చేస్తున్నారు కొందరు ఉద్యోగులు. భక్తుడికి అశ్లీల చిత్రాలు పంపించారు.

SVBC employees: పవిత్ర తిరుమల శ్రీవారి సన్నిధిలో పాడు పనులు చేస్తున్నారు కొందరు ఉద్యోగులు. తమ తప్పుడు పనులకు ఏకంగా SVBC శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ను వాడుకుంటున్నారు. ఏకంగా ఓ ఉద్యోగి.. ఓ భక్తుడికి అశ్లీల చిత్రాలు పంపడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

తిరుమల శ్రీవారి భక్తి కార్యక్రమాలకు భక్తులకు ఎప్పటికప్పుడు అందించేందుకు SVBC ఛానల్ ను ప్రారంభించారు. ఈ ఛానల్ లో ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఓ భక్తుడు SVBCకి ఓ మెయిల్ పంపారు.అయితే.. మెయిల్ కు రిప్లై ఇచ్చిన ఛానల్ ఉద్యోగి.. భక్తుడికి అశ్లీల వీడియో పంపించాడు.

భక్తి కార్యక్రమాల రిప్లై రావాల్సిన మెయిల్ నుంచి అశ్లీల వీడియో రావడంతో షాక్ అయ్యాడు ఆ భక్తుడు వెంటనే టీటీడీ చైర్మన్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సీరియస్ అయిన చైర్మన్, ఈవో... SVBC కార్యాలయంలో సోదాలు చేయించారు. ఇందులో విస్తుపోయే అంశాలకు బయటకొచ్చాయి.

టీటీడీ విజిలెన్స్ తోపాటు, సైబర్ క్రైం అధికారులు ఎస్వీబీసీ ఆఫీసులో సోదాలు చేశారు. భక్తుడికి అశ్లీల వీడియో పంపిన ఉద్యోగిని గుర్తించారు. అంతేకాదు.. మరో ఐదుగురు ఉద్యోగులు కార్యాలయంలో అశ్లీల వెబ్ సైట్లు ఓపెన్ చేసి వీడియోలు చూస్తున్నట్టు గుర్తించారు.

పనులు పక్కన పెట్టి.. యూట్యూబ్ లో కాలక్షేపం చేస్తున్న మరికొందరిని గుర్తించిన అధికారులు.. వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. దాదాపు 25 మంది వరకు ఆఫీసులో తప్పుడు పనులు చేస్తున్నట్టు గుర్తించారు. వీరిపై చర్యలకు రెడీ అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం.

- స్వల్పంగా పెరిగిన బంగారం ధర

- దుబ్బాకలో BJP గెలుపుకు, TRS ఓటమికి 5 కారణాలు ఇవే!

Next Story
Share it