Top
Batukamma

పెళ్లికి పిలుస్తున్నా.. ఎవ్వరూ రావొద్దు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆహ్వానం!

పెళ్లికి పిలుస్తున్నా.. ఎవ్వరూ రావొద్దు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆహ్వానం!
X
Highlights

కేవలం కొందరు సమక్షంలోనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే వివాహ తంతు ముగుస్తుంది.

రాజకీయ నాయకుల, సినీతారల ఇంట్లో పెళ్లి అంటే ఎంతో ఘనంగా జరుగుతుంది. బంధువులు స్నేహితులు ఎంతోమంది హాజరవుతారు. అయితే కరోనా దెబ్బకి మొత్తం సీన్ మారిపోయింది.

కేవలం కొందరు సమక్షంలోనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే వివాహ తంతు ముగుస్తుంది.

తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా తన కుమార్తె వివాహన్నీ ఎలాంటి హడావుడి లేకుండా చేస్తున్నారు. కొంతమంది అతిథుల సమక్షంలోనే పెళ్లి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 2న తన కుమార్తె నవ్యశ్రీ వివాహాన్ని ఫిక్స్ చేశారు.

అయితే వివాహానికి సంబంధించిన పెళ్లి కార్డు ను స్వీట్ బాక్స్ ను అందరికీ పంచుతూ.. కరోనా నేపధ్యంలో వివాహానికి ఎవరూ రావొద్దని ఆయన కోరారు. పరిస్థితుల్ని గమనించి, సహృదయంతో ఇళ్ల నుంచి నూతన వధూవరులకు ఆశీర్వదించాలని కోరారు.

దెందులూరు నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటివరకు లక్ష స్వీట్ బాక్సులు పంచి పెట్టారు. వివాహ వేడుకకు సంబంధించిన లింక్‌లను స్వీట్ బాక్సులపై ముద్రించారు.

Next Story
Share it