Top
Batukamma

లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. ట్రాక్టర్ అదుపుతప్పి!

లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. ట్రాక్టర్ అదుపుతప్పి!
X

Nara Lokesh

Highlights

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. అయితే ఆ ట్రాక్టర్ అదుపుతప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది.

అయితే లోకేష్ పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపుచేశారు. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్‌ నుంచి దింపేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు ఊపిరిపీల్చుకున్నారు.


ఇక రాష్ట్రంలో వరద తీవ్రతపై అధికార వైసీపీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు లోకేష్.. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఈరోజు భారీవర్షాల వల్ల కొల్లేరు సరస్సు ముంపుకు గురైన శృంగవరప్పాడు బాధితులను కలుసుకున్నాను. గ్రామం అంతటా మోకాలి లోతు నీళ్ళు. నిత్యావసర సరుకులు కూడా అందని పరిస్థితి. ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యమా? అని లోకేష్ అన్నారు.

గ్రామస్తులకు ప్రభుత్వ సాయం అందించడం సంగతి అటుంచి.. కనీసం నాయకులు, అధికారులు వచ్చి ఇంతవరకు పలకరించిన పాపాన పోలేదు. గ్రామానికి వైద్య సదుపాయాలు లేక విష జ్వరాలు సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదనతో గ్రామస్తులు చెబుతుంటే కళ్ళు చెమర్చాయని లోకేష్ ట్వీట్ చేశారు..

Next Story
Share it