టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి!

X
Highlights
వై.టి.రాజా 1999 నుంచి 2004 వరకు తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ తరుపున 2004,19లో తుణుకు నుంచి పోటి చేశారు కానీ అయన గెలవలదు.
Batukamma15 Nov 2020 3:42 AM GMT
టీడీపీ సీనియర్ నేత, తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి.రాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆయనకి ఇటీవల కరోనా సోకగా, కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మళ్ళీ అనారోగ్య సమస్యలతో హైదరాబాదుకి వచ్చారు. ఇక వై.టి.రాజా 1999 నుంచి 2004 వరకు తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ తరుపున 2004,19లో తుణుకు నుంచి పోటి చేశారు కానీ అయన గెలవలదు.
తణుకు కన్జ్యూమర్ కో-ఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షుడిగా కూడా వై.టి.రాజా బాధ్యతలు నిర్వహించారు. అయన మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలుపుతున్నారు. వై.టి రాజా సొంతూరు గుంటూరు జిల్లా కారంచేడు కాగా, ఆయనని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చెందిన చెందిన యలమర్తి నారాయణరావు దత్తత తీసుకున్నారు.
Next Story