Top
Batukamma

వైభవంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు

వైభవంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు
X
Highlights

హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.

తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన శనివారం రాత్రి హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆల‌య మండపంలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అమ్మవారికి వాహన సేవ కొనసాగింది.

ఈ సందర్భంగా హనుమంత వాహన ప్రత్యేకతను వివరించారు అర్చకులు. హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది.


భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుందని వివరించారు.


పెద్దజీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామితో పాటు టీటీడీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story
Share it