Top
Batukamma

ఇద్దరమ్మాయిలు ప్రేమించుకున్నారు.. లేచిపోయారు కూడా

ఇద్దరమ్మాయిలు ప్రేమించుకున్నారు.. లేచిపోయారు కూడా
X
Highlights

సహజంగా అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు.. ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి కూడా చేసుకుంటారు.. కానీ ఒక అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమించి పారిపోయిన ఘటన ఏపీ లోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది..

సహజంగా అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు.. ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి కూడా చేసుకుంటారు.. కానీ ఒక అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమించి పారిపోయిన ఘటన ఏపీ లోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది..

ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లాలోని సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ( 21) , నరసింహా రెడ్డి నగర్ కు చెందిన మరో యువతి (20) ఇద్దరికీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహం ఉంది..

అయితే ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది.. ఈ క్రమంలో ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఈ నెల 3వ తేదీన ఇంటి నుంచి పారిపోయారు.. ఇంటి నుంచి వెళ్లే ముందు సమాచారం పంపి వెళ్లిపోయారు..

దీనితో షాక్ కు గురైన ఇరువురి కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లాలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. దీని పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Next Story
Share it