జగన్ ని భయపెట్టిన కేసీఆర్!

అటు వైఎస్సార్సీపీ కూడా దూరంగా ఉంటున్నట్లు తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు.
GHMC ఎన్నికల కోసం అన్నీ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచార అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఇక . ఇదిలా ఉంటే ఈ ఎన్నికలకు జనసేన పార్టీ దూరంగా ఉంటున్నట్టుగా ప్రకటించారు అధినేత పవన్ కళ్యాణ్.
అటు వైఎస్సార్సీపీ కూడా దూరంగా ఉంటున్నట్లు తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. రాబోయే కాలంలో తెలంగాణలో కూడా వైసీపీ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.
అయితే GHMC ఎన్నికల్లో వైసీపీ బరిలో లేకపోవడంతో ఏపీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆసక్తికర ట్వీట్ చేశారు. "ఒక్క సీట్ లో కూడా పోటీ చెయ్యట్లేదు అంటే, మా షియం గారిని మరీ అంతలా భయపెట్టారా కేసిఆర్ గారూ ? అంటూ ట్వీట్ చేశారు అనిత.
ఒక్క సీట్ లో కూడా పోటీ చెయ్యట్లేదు అంటే, మా షియం గారిని మరీ అంతలా భయపెట్టారా కెసిఆర్ గారూ ?🤔 pic.twitter.com/r1lTlkxda6
— Anitha Vangalapudi (@Anitha_TDP) November 20, 2020
ఇక అటు GHMC ఎన్నికలకి డిసెంబర్ 01న పోలింగ్ జరుగుతుండగా, డిసెంబర్ 04 న ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం ఏడూ గంటల నుంచి సాయింత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రధాన పోటి మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే సాగనుంది.