దివ్యతేజస్విని హత్య కేసులో మరో ట్విస్ట్ : ఆడియో లీకులు బయటకు

Divya Tejaswini
దివ్యతేజస్విని కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. తాజా నాగేంద్రతో దివ్య మాట్లాడిన ఫోన్ కాల్స్ లీక్ అవుతున్నాయి..
దివ్యతేజస్విని కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. తాజా నాగేంద్రతో దివ్య మాట్లాడిన ఫోన్ కాల్స్ లీక్ అవుతున్నాయి.. ఈ ఆడియో టేపులను వింటుంటే ఇద్దరికీ పెళ్లి అయినట్టుగానే తెలుస్తోంది. ఇందులో దివ్య నాగేంద్రతో మాట్లాడుతూ.. తానూ ఇంతకుముందులా అందరితో కలిసి ఆనందంగా ఉండలేకపోతున్నానని ఆవేదనని వ్యక్తం చేసింది. అంతేకాకుండా తీవ్ర సంఘర్షణకు గురైనట్లు చెప్పుకొచ్చింది. తానూ ఇలా ఎందుకు ఉంటున్నానో అర్ధం కావడం లేదని ఫోన్లో వాపోయింది దివ్య తేజస్విని.. తనకి నాగేంద్రతో పాటు భవిష్యత్ కూడా చాలా ముఖ్యమని దివ్య ఈ ఫోన్ కాల్స్ లో వెల్లడించింది.
అటు ఓ ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా కొన్ని కీలక విషయాలను వెల్లడించింది దివ్య. తానూ నాగేంద్రతో రెండేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నట్టుగా ఆ వీడియోలో వెల్లడించింది. నాగేంద్ర ఓ సైకో అని వెల్లడించింది. అయితే అతని నుంచి బెదిరింపు కాల్స్, బెదిరింపు మెసేజ్ లు వచ్చినట్టుగా వెల్లడించింది. అంతేకాకుండా తన ఫ్యామిలీ కూడా బెదిరించేవాడని దివ్య వాపోయింది. తన నుంచి ఎం కావాలో అర్ధం కావడం లేదని అంది. ఇక ఓ మహిళ కారణంగా తను మోసపోయానని అంది. ఈ వీడియోని దివ్య అక్టోబర్ మూడున చేసింది.