Top
Batukamma

ఈ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతోందా..? పాముకు పాలు పోస్తోందా..?

Why Ys Jagan silent on bjp.jpg
X
Highlights

సామరస్యంగా అన్ని మతాలూ బతుకుతున్న రోజుల్నే వారు తలచుకుంటున్నారు. కానీ అలానే రోజులు ఎప్పటికీ వుండవు.

Why Ys Jagan intentionally silent on bjp : పిల్లి కళ్ళుమూసుకొని ఎవరూ తనను చుడడం లేదనుకుని పాలు తాగుతుందట. జగన్ తీరు అలాగే వుంది చూస్తుంటే.

విగ్రహాల ధ్వంసం ఘటనలపై స్పందిస్తూ దీనికంతా కారణం బాబు(chandrababu) మరియు అతని పార్టీ అంటూ మాట్లాడాడు తప్ప ఎక్కడా బీజేపీని, దాని బహిరంగ మత రాజకీయాలనీ ఖండించే ధైర్యం చేయలేదు.

అధికారం సంపాదించడానికి బాబుకు ఏ మార్గమూ నిషిద్దం కాదు. అయితే ఇంతవరకూ మతకల్లోలాలు రెచ్చగొట్టడమనే నీచమయిన పనికి పాల్పడినట్టుగా బాబుకు రికార్డు లేదు. లౌకికవాదం ఇంకా కొనవూపిరితో వున్నప్పుడు, గుజరాత్(gujarath riots) మారణహోమం కాలంలో మోదీని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వను అన్నాడు. అదే బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్నాడు. మోదీ(modi) ఇంతింతై వటుడింతై అంటూ కేంద్రంలో అధికారం చేపట్టాక అతని ప్రాపకానికి ప్రాకులాడాడు.

కానీ జగన్ వ్యూహాత్మకంగా వేసిన "ప్రత్యేక హోదా" వుచ్చులో చిక్కుకొని మోదీకి ఎదురు వెళ్ళి తీవ్రంగా భంగపడ్డాడు. ఒకసారి బీజేపీ-టీడీపీ స్నేహాన్ని భగ్నం చేశాక, అదే బీజేపీతో చెట్టపట్టాల్ వేసుకోవడానికి జగన్ తహతహలాదుతున్నాడు. కానీ ఇది అసహజం. బీజేపీ(bjp) హిందూమత రాజకీయాలపై ఆధారపడినట్టిది. జగన్ రెడ్లు, దళితులు, క్రైస్తవులు మొదలగు వర్గాలతో పాటు తన తండ్రి ప్రారంబించిన సంక్షేమ పథకాల పెట్టుబడులపై ఆధారపడినవాడు.


తాను స్వయంగా క్రైస్తవుడో(Christian) కాదో త్రెలియదు గానీ, తన తల్లి విజయమ్మ(ys vijayamma) బహిరంగంగా బైబిల్(bible) పట్టుకొని ఎన్నికల సభల్లో పాల్గోవడం, అతని బావ పెద్ద క్రైస్తవ మత ప్రచారకుడుగా వుండడం అతను క్రైస్తవుడే అని ప్రజలు నమ్మడానికి ఆస్కారాలు. కోర్టులు అతన్ని క్రైస్తవుడు కాదని చెప్పాయా, అవునని చెప్పాయా అన్నది ప్రజలకు అవసరం లేదు.

ఇలాంటప్పుడు మతాన్నే ఇంధనంగా వాడే బీజేపీకి, తద్విరుద్దంగా రాజకీయాలని నెరపడం అవశ్యకమైన జగన్(jagan) పార్టికి కుదరనే కుదరదు. మరెందుకు జగన్ బీజేపీకి ఎదురు వెళ్ళడానికి సంశయిస్తున్నాడు? వెంటనే మనకు తోచేది అతని మీదున్న అవినీతి కేసులు. పైకి రాష్ట్రావసరాల కోసమే అని చెప్పినప్పటికీ అది నమ్మదగినదిగా లేదు. అప్పటి అధికార కాంగ్రెస్‌కు ఎదురువెళ్ళి జైలు జీవితం రుచి చూసిన జగన్ దానికి భయపడుతున్నాడనుకోవాలా? మూడింట రెండొంతులుకు పైగా సీట్లు గెలిచి అధికారం చేపట్టిన జగన్‌లో ఆ దూకుడు ఏది?

బీజేపీనీ ఒక్కమాటా అనకుండా దాని స్నేహ హస్తం కోసం అర్రులు చాచినా అందుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. పాముకు పాలుపోస్తూ అది తన్ను కాటేయదు అని భ్రమించినట్టే, బీజేపీకి మద్దతు ఇస్తున్నాను కదా, నా జోలికి రాదు అని జగన్ అనుకుంటుంటే దీనికి మించిన ఆత్మద్రోహం మరొకటి వుండబోదు. మారు మాట్లాడకుండా రాష్ట్రపతి ఎన్నికకు మద్దతు. మారుమాట్లాడకుండా మతవివక్ష చట్టాలైన పౌరసత్వ చట్టాలకు మద్దతు. రైతు చట్టాలకు మద్దతు. ఏ ఒక్క విషయంలోనూ బీజేపీని ప్రత్యక్ష్యంగా గానీ, పరోక్షంగా గానీ మాటవరసకు కూడా వేలెత్తి చూపని ధోరణి.

సోనియాతో(Sonia Gandhi) డీకొని జైలులో పదహరు నెలలు వుండి కూడా, బయటకు వచ్చి విపరీతమైన పాదయాత్రలతో, ఓదార్పు యాత్రలతో, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అడ్డంకులను అధిగమించి, హేళనలను అధిగమించి అఖండ మెజారిటీతో గెలిచిన జగన్, బీజేపీ ముందు బేలగా బేర్ మనడం చూస్తూంటే జైలు జీవితం ఇతనికి పిరికిమందు పోసిందా అనే అనుమానం రాకమానదు.

బాబు రాజకీయాలు రియాక్షనరీ మాత్రమే. అధికారం కోసం అతనికి మిగిలివుంది బీజేపీ మతరాజకీయాలు మాత్రమే. అభివృద్ది రాజకీయాలు పనిచేయవు అని అతనికి అర్థం అయ్యింది. విగ్రహాలు పగులగొట్టింది ఎవ్వరైనా దానికి నిరసన టీడీపీ చెయ్యకపోతే బీజేపీ చేస్తుంది. జగన్‌ కు ఏ రాయి అయితే ఏమిటి పళ్ళూడగొట్టుకోవడానికి?


కానీ ఒక బాబునే ముద్దాయిని చేస్తూ బీజేపీని ముద్దు చేయడం పులిమీద స్వారీ చేయడమే. చర్చను అభివృద్ది నుండీ, సంక్షేమం నుండీ మతం మీదికి మళ్ళించడం అనేది జగన్‌కు ఇష్టం వున్నా, లేకున్నా, బాబుకు ఇష్టం వున్నా లేకున్నా బీజేపీ చేస్తూనే వుంటుంది. అయితే చర్చ అటు వెళ్ళకుండా చూడడమే జగన్ చెయ్యాల్సింది. చర్చ అటు వెళ్ళింది అంటే ఆటలో ఓడిపోయినట్టే. శకుని ఆడుతున్నాడని తెలిసీ ధర్మరాజు ఆటకు కూర్చోవడంలో అర్థం లేదు. కూర్చున్నాడా ఓటమి తప్పదు.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆంద్రా ప్రజలు ఇంకా మతపిచ్చిలో కూరుకుపోలేదు. సామరస్యంగా అన్ని మతాలూ బతుకుతున్న రోజుల్నే వారు తలచుకుంటున్నారు. కానీ అలానే రోజులు ఎప్పటికీ వుండవు.

ఈరోజు విగ్రహాల తలలు విరుగుతున్నాయి. రేపు మనుషుల తలలు తెగవనే గ్యారంటీ లేదు. అప్పుడు ప్రతి మతస్తుడికీ తన తన మతం చాటున దాక్కోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. మాతాన్ని బట్టి చీలిక ఏర్పడిన రోజున బీజేపీ అధిపత్యానికి ఎదురుండదు. ఇది గత ఇరవై ఏళ్లుగా మనం కళ్ళెదుట చూస్తున్న సత్యం. బీజేపీ అనే మత మహమ్మారిని వదిలేసి, టీడీపీ అనే దాని నీడను లక్ష్యం చేసుకోవడం వల్ల ఏ ఉపయోగమూ లేదు.

బీజేపీకి ఎదురెళ్ళి ఢీకొంటే ఏమవుతుంది? మహా అయితే మళ్ళీ జైల్లో పెడతారు అంతేగా? కానీ దేశమంతా బీజేపీ వ్యతిరేకతకు ఓ వేదిక ఇచ్చినట్టు అవుతుంది. ఆలస్యంగానైనా దేశం జగన్ వెనుకాల నిలబడుతుంది. రాష్ట్రంలో ఎలాగూ రెడ్డి, క్రైస్తవ, దళితుల నిర్ద్వంద మద్దతు ఎలాగూ వుంది. అది మరింత బలమవుతుంది. మతాధారిత రాజకీయాలు గాక అభివృద్ది రాజకీయాలకు ఊతం దొరుకుతుంది. 85శాతం సీట్లతో గెలిపించినందుకు రాష్ట్రప్రజలకు కృతజ్ఞత తెలిపినట్లవుతుంది.

- Prasad చెరసాల

ఇవి కూడా చదవండి:

- దెబ్బతిన్న పులి శ్వాస ఎంత భీకరంగా... వేట ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా..?

- జీవితా రాజశేఖర్ లకి మిగిలింది ఇక ఆ రెండే..

- ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో.. అతడే....!

- అందంతో హీటు పుట్టిస్తున్న చిరుత పోరి

- Dirty hari హీరోయిన్ సిమ్రత్ కౌర్ హాట్ ఫొటోలు

- అనసూయ 'కసి కథలు'.. దుమ్ముదులిపిన నెటిజన్లు!

Next Story
Share it