దొంగతనం చేసిన చీరనే వాట్సప్ స్టేటస్ పెట్టింది!

అయితే ఆయన ఉంటున్న ప్లాట్ లో గత నీలం29న భారీ చోరీ జరిగింది. నాలుగు గాజులు, మంగళ సూత్రం, నెక్లెస్, చెవిదిద్దులు రెండు, బేబీచైన్ ఒకటి, మరికొన్ని వస్తువులు చోరీకి గురయ్యాయి.
దొంగతనం చేసిన చీరను రెండు నెలల తర్వాత కట్టుకొని వాట్సాప్ స్టేటస్ పెట్టి అడ్డంగా దొరికిపోయింది ఓ మహిళ.. తాడేపల్లి పట్టణ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. డోలాస్నగర్ ప్రైమ్ గెలాక్సీ అపార్ట్మెంటులోని ఫ్లాటులో కత్తి ఆమోద్ ఉంటున్నారు.
అయితే ఆయన ఉంటున్న ప్లాట్ లో గత నీలం29న భారీ చోరీ జరిగింది. నాలుగు గాజులు, మంగళ సూత్రం, నెక్లెస్, చెవిదిద్దులు రెండు, బేబీచైన్ ఒకటి, మరికొన్ని వస్తువులు చోరీకి గురయ్యాయి. దీనితో ఆమోద్ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. పోలీసులు కూడా విచారణ చేపట్టారు కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
అయితే సునీత అనే మహిళ దొంగతనం చేసిన చీరతో వాట్సాప్ స్టేటస్ పెట్టడంతో ఆమోద్ భార్య దాన్ని చూసి భర్తకి తెలియజేసింది. వెంటనే ఆమోద్ పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసులు సునీతను మంగళగిరి కొత్త బస్టాండ్ దగ్గర అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.
సునీతను పోలీసులు తమదైన స్టైల్ లో పోలీసులు విచారణ చేయగా మొత్తం కక్కింది. సునీత గతంలో అదే అపార్టుమెంటులో పని మనిషిగా పనిచేసేది. ఆ సమయంలో ఖాళీగా ఉన్న ఫ్లాట్లను ఊడవమని అపార్టుమెంటు మేనేజర్ తాళాలు ఇవ్వగా, వాటితో పాటు ఆమోద్ ఫ్లాటు డూప్లికేట్ తాళాలు కూడా తీసుకువెళ్లి చోరీకి పాల్పడినట్టుగా సునీత విచారణలో ఒప్పుకుంది.
ఆ తరవాత లోపల కబోర్డు పగలగొట్టి బంగారం, నగదు , చీరలను ఎత్తుకెళ్లినట్టుగా ఒప్పుకుంది.