Top
Batukamma

బుట్టా రేణుకకి సీఎం జగన్ కీలక పదవి?

బుట్టా రేణుకకి సీఎం జగన్ కీలక పదవి?
X
Highlights

వైసీపీ తరుపున కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బుట్టా రేణుక విజయం సాధించింది.. అయితే టీడీపీ ఆకర్షణలో వైసీపీని వీడింది..

రాజకీయాల్లో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయని అంటారు.. అవును.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది కర్నూల్ మాజీ ఎంపీ బుట్టా రేణుక..

వైసీపీ తరుపున కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో విజయం సాధించింది.. అయితే టీడీపీ ఆకర్షణలో ఆమె వైసీపీని వీడింది.. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఆమెకి టికెట్ నిరాకరించడంతో మళ్లీ జగన్ పార్టీకి చేరింది.. అయితే ఆ ఎన్నికల్లో ఎలాంటి సీటు ఆశించకుండా పార్టీ తరుపున ప్రచారం చేసింది..

ఆ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఆ తర్వాత బుట్టా రేణుక రాజకీయాల పరంగా సైలెంట్ అయిపోయింది.. ఇప్పుడు ఎక్కడ కూడా ఆమె పేరు వినిపించడం లేదు... ఆ మధ్య ఎమ్మెల్సీ సీటు ఇస్తున్నారన్నా ప్రచారం నడిచింది కానీ అది నిజం కాలేదు.. అయితే ఇప్పుడామెకు జగన్ కీలక పదవి ఇవ్వవోతున్నారని తెలుస్తోంది..

త్వరలో ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కర్నూల్ మేయర్ పీఠాన్ని ఆమెకి అప్పగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పదవికి కూడా గట్టిపోటీ కూడా ఉందని సమాచారం..బుట్టా రేణుక లాగే వైసీపీ నుంచి ఎమ్మెల్యే గా గెలిచి మళ్లీ టీడీపీకి వెళ్లి, మళ్లీ అక్కడి నుంచి వైసీపీకి వచ్చిన ఎస్వీ మనోహర్ రెడ్డి ఆ పదవిని తన భార్య కోసం ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది..

అయితే సామాజిక పరిణామాల దృష్ట్యా జగన్ బీసీ మహిళ అయిన బుట్టా రేణుక వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం.. గతంలో కర్నూల్ ఎంపీ సీటు ఆమెకి ఇచ్చినప్పుడు కూడా పార్టీలో విభేదాలు వచ్చినప్పటికీ జగన్ ఆమెకే టికెట్ ఇచ్చారు.. ఇప్పుడు కూడా ఆమెకే కర్నూలు మేయర్ స్థానం అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.. చూడాలి మరి ఎం జరుగుతుందో..

Next Story
Share it