Top
Batukamma

ఫ్రెండ్ గా ఉంటే ప్రేమ అన్నాడు.. ఒప్పుకోలేదని గొంతుకోసి చంపాడు

ఫ్రెండ్ గా ఉంటే ప్రేమ అన్నాడు.. ఒప్పుకోలేదని గొంతుకోసి చంపాడు
X
Highlights

విజయవాడకి చెందిన దివ్య తేజస్విని హత్య కేసు మరిచిపోకముందే విశాఖలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైపోయింది. ఈ సంఘటన గాజువాక సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది.

విజయవాడకి చెందిన దివ్య తేజస్విని హత్య కేసు మరిచిపోకముందే విశాఖలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైపోయింది. ఈ సంఘటన గాజువాక సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉండే వరలక్ష్మీ అనే విద్యార్థి ఓ ప్రైవేటుు కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. ఇక అదే ప్రాంతానికి చెందిన అఖిల్ అనే వ్యక్తి బి.ఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే వివాహానికి సంబంధించి వరలక్ష్మి తన అన్నయ్య ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో తనతో మాట్లాడాలని చెప్పి వరలక్ష్మీని అఖిల్ సుందరయ్యనగర్ లోని సాయిబాబా టెంపుల్ కొండపైకి తీసుకెళ్లాడు.

అయితే అక్కడ ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. ఇది తట్టుకోలేకపోయిన అఖిల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో వరలక్ష్మీపై దాడి చేశాడు. దీనితో వరలక్షికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే బాధితురాలిని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందింది.

అఖిల్ చేతులకు రక్తపు మరకలు అంటుకుని ఉండడం, నేరాన్ని అంగీకరించడంతో అఖిల్ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అటు వరలక్ష్మి ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి..

వరలక్ష్మిని ప్రేమించాలని అఖిల్ పలుమార్లు వేధించేవాడని స్థానికులు అంటున్నారు. దివ్య తేజస్విని హత్య కేసు మరిచిపోకముందే ఇలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకోవడం స్థానికంగా అందర్నీ షాక్ కి గురిచేసింది.

Next Story
Share it