Top
Batukamma

మళ్లీ ఢిల్లీకి జగన్.. ఈ సారి అది పక్కానా..?

మళ్లీ ఢిల్లీకి జగన్.. ఈ సారి అది పక్కానా..?
X
Highlights

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు మరోసారి ఢిల్లీ టూర్ కు రెడీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే ఢిల్లీలో అమిత్ షా, ఆ తర్వాత మోడీని కలిసిన జగన్ ఇప్పుడు మరోసారి ఢిల్లీ టూర్ కు రెడీ అయ్యారు. ఇవాళో రేపో ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

ఈ పర్యటనలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీని.. జగన్ కలిసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ప్రధానమంత్రితో ఎందుకు ఇన్నిసార్లు భేటీ అవుతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారం రోజుల్లోనే రెండోసారి ఎందుకు కలవాల్సి వస్తోందనేది ఇప్పుడు హాట్ టాపిక్.

ఈ సారి ప్రధానమంత్రితో పాటు.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కూడా జగన్ కలిసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. మోడీ అపాయింట్ మెంట్ పై ఎలాంటి అధికారిక సమాచారం అందనట్టు సమాచారం. అపాయింట్ మెంట్ ఖరారు కానున్నా ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు జగన్.

మరోవైపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై ఆరోపణలతో ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై రాష్ట్రపతితో జగన్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులపై ప్రధానితో చర్చిస్తారని.. ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

జగన్ ఢిల్లీ పర్యటన కారణాలు మాత్రం వేరే ఉన్నాయంటున్నారు నేతలు. ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలోని NDA కూటమిలో చేరే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మొన్న జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడే ఈ ప్రచారం జోరందుకుంది. ఇప్పుడు మరోసారి వెళ్తుండటంతో ఈ సారి అధికారిక ప్రకటన రావొచ్చంటున్నారు నేతలు.

అలాగే.. సుప్రీంకోర్టు న్యూయమూర్తి విషయంలో ఏపీ సర్కారు రాసిన లేఖల ఇష్యూపైనా రాష్ట్రపతితో, ప్రధానితో డిస్కస్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story
Share it