Top
Batukamma

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం!

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం!
X
Highlights

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా మాస్క్...

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ని ధరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వస్తున్న కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 20,245 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 2,592 పాజిటివ్ కేసులు వచ్చాయి.. కరోనా కారణంగా మరో 42మంది చనిపోయారు. ఇక 943మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40,646కు చేరుకోగా, అటు మరణాల సంఖ్య 534కి చేరింది. అటు కరోనాతో ఇప్పటివరకూ 20,298 మంది కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 19,814మంది చికిత్స పొందుతున్నారు.

Next Story
Share it