Top
Batukamma

Tik Tok : టిక్ టాక్ లవర్స్ కి మరో బ్యాడ్ న్యూస్..!

Tik Tok : టిక్ టాక్ లవర్స్ కి మరో బ్యాడ్ న్యూస్..!
X
Highlights

Tik Tok : ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కు సంబంధించి మరో బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. టిక్ టాక్ ను...

Tik Tok : ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కు సంబంధించి మరో బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ భారత్ తో పాటు అమెరికా నిర్ణయం తీసుకున్నాయి. దీంతో భారత్ లో చాలా రోజులుగా సేవలు నిలిచిపోయాయి. అమెరికాలో మాత్రం ఈ నెలాఖరు వరకు టిక్ టాక్ కు సమయం ఇచ్చారు.

టిక్ టాక్ కు ట్రంప్ డెడ్ లైన్ పెట్టడంతో.. దాన్ని అమ్మేస్తున్నారని వార్తలు వచ్చాయి. టిక్ టాక్ మాతృసంస్థతో పలు సంస్థలు కొనుగోలు ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నాయని వార్తలొచ్చాయి. ఇందులో ప్రధానంగా వినిపించిన పేరు మైక్రోసాఫ్ట్.

సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ అయిన మైక్రో సాఫ్ట్... టిక్ టాక్ యాప్ ను కొనుగోలు చేస్తోందని వార్తలు వచ్చాయి. అమెరికాతో పాటు మరికొన్ని దేశాలకు సంబంధించి హక్కులు కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ రెడీ అయ్యింది. దీనిపై రెండు కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు కూడా జరిగాయి.

ఈ డీల్ గురించి చర్చించేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను కూడా కలిశారు మైక్రోసాఫ్ట్ చీఫ్. టిక్ టాక్ ను టేకోవర్ చేసేందుకు రెడీ ఉన్నట్టు చెప్పారు.

కానీ ఇప్పుడు ఈ డీల్ కు బ్రేక్ పడింది. టిక్ టాక్ ను కొనేందుకు తాము చేసిన ప్రతిపాదన రిజెక్ట్ అయ్యిందని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. బైట్ డాన్స్ సంస్థ.. టిక్ టాక్ కు సంబంధించి యూఎస్ ఆపరేషన్స్ తమకు విక్రయించడం లేదంటూ.. మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది.

డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో ఇప్పుడు అమెరికాలో టిక్ టాక్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. ఇప్పటికే టిక్ టాక్ బ్యాన్ ను సవాల్ చేస్తూ బైట్ డాన్స్ కోర్టుకెక్కింది. అమెరికాలో టిక్ టాక్ 175 మిలియన్ల డౌన్ లోడ్ లు జరిగాయి.

భారత్ లో ఇప్పటికే టిక్ టాక్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. భారత్ లో టిక్ టాక్ హక్కులు కొనేందుకు ఇప్పటికే రిలయన్స్ జియో ప్రయత్నాలు మొదలుపెట్టింది. జియో, బైట్ డాన్స్ మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇవి కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.

Next Story
Share it