Sumanth : అన్నీ ఉన్న అత్యంత దురదృష్టవంతుడు హీరో సుమంత్!

Sumanth : ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న, టాలెంట్ ఉన్న అదృష్టం లేకపోతే మాత్రం రాణించడం చాలా కష్టం.....
Sumanth : ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న, టాలెంట్ ఉన్న అదృష్టం లేకపోతే మాత్రం రాణించడం చాలా కష్టం.. ఇప్పటికి ఇండస్ట్రీలో చాలా మంది అదృష్టం మీద కెరీర్ ని నెట్టుకొస్తున్నారు.. కానీ యార్లగడ్డ సుమంత్ కి అన్నీ ఉన్న అదృష్టం లేని దురదృష్టవంతుడు అయిపోయాడు .. తాత ఓ లెజెండ్, మావయ్య స్టార్ హీరో.. ఇవి చాలు సుమంత్ స్టార్ హీరో అయిపోవడానికి.. కానీ సుమంత్ ఎక్కడ మిస్టేక్స్ చేశాడు.
ఫస్ట్ మూవీ కథను సరిగ్గా ఎంచుకోకపోవడం.. అవును నటవారసుడి ఎంట్రీ అంటే ప్రేక్షకుల అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అందుకే సుమంత్ డెబ్యూ మూవీ కోసం బాగానే కసరత్తులు చేశారు మామ నాగ్.. చాలా మంది దగ్గర కథలు విని ఫైనల్ గా తన కెరీర్ ని మలుపు తిప్పిన వర్మకి ఓటు వేశాడు నాగ్..
1999లో సుమంత్ "ప్రేమ కథ" చిత్రం రిలీజ్ అయింది. మంచి అందగాడు... కానీ సినిమాలో సుమంత్ లుక్ చూసి చాలా మంది ఫ్యాన్స్ నిరాశకి గురయ్యారు. సినిమా ప్లాప్.. ఆ తర్వాత చాలా కేర్ తీసుకొని యువకుడు(2000) సినిమా చేస్తే యావరేజ్ గా మిగిలింది. ఇక మూడో సినిమా కే. రాఘవేంద్రరావు డైరెక్షన్లో పెళ్లి సంబంధం(2001) అనే సినిమాని నచ్చకున్న చేశాడు సుమంత్.. ఈ సినిమా కూడా ప్లాప్ అయింది..
మూడు సినిమాలు ప్లాప్ .. డిప్రెషన్ లోకి వెళ్ళాడు సుమంత్.. ఈ టైంలో కొత్త సినిమాల కథలను వినడం పక్కన పెట్టేసి స్నేహమంటే ఇదేరా (2001), రామ్మా చిలకమ్మా(2001) సినిమాలని కంప్లీట్ చేశాడు సుమంత్.. కానీ అవి కూడా ప్లాప్ అయ్యాయి. దీనితో కొన్ని రోజుల సినిమాలకి దూరంగా ఉన్నాడు సుమంత్.. ఈ సినిమాలను చూస్తే సుమంత్ లో ఓ క్లాస్ నటుడు ఉన్నాడు అన్న విషయం మనకి అర్ధం అవుతుంది.
ఇక బాగా స్టడీ చేసి సుమంత్ ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని పక్కా కథని రెడీ చేసి అన్నపూర్ణ ప్రొడక్షన్ లోనే సత్యం(2002) అనే సినిమాని చేశారు. ఇది సుమంత్ కి ఫస్ట్ సక్సెస్.. ఆ తర్వాత మాస్ ఇమేజ్ కోసం చేసిన గౌరీ పర్వాలేదు అనిపించింది. ఇక గోదావరి మంచి హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ సుమంత్ కి బ్యాడ్ డేస్.. చేసిన ఒక్క సినిమా కూడా ఆడడం లేదు..
దీనితో మాస్ ఇమేజ్ లను పక్కన పెట్టి విభిన్నమైన కథలను ఎంచుకోవడం మొదలు పెట్టాడు సుమంత్.. గోల్కొండ హై స్కూల్, దగ్గరగా దూరంగా, మళ్ళీరావా, నరుడా డో నరుడా లాంటి సినిమాలను చేసి మంచి హీరో అనిపించుకున్నాడు. కానీ ఇవేవి సుమంత్ ని స్టార్ ని చేయలేదు కానీ సుమంత్ ని గుర్తుపెట్టుకునేలా చేశాయి.
సుమంత్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే చాలా సినిమాలను వదులుకోవడం.. సుమంత్ వదులుకున్న కొన్ని సినిమాలు బాగా హిట్ అయ్యాయి.. కొన్ని ఇండస్ట్రీ హిట్ అయ్యాయి.. "తొలిప్రేమ, మనసంతా నువ్వే, నువ్వేకావాలి, ఇడియట్, దేశముదురు, నువ్వస్తావని" చిత్రాలు ముందుకు సుమంత్ దగ్గరికి వచ్చినవే.. ఇందులో కొన్ని సుమంత్ వద్దనుకుంటే, కొన్ని నాగార్జున వద్దన్నారు. ఈ సినిమాలు సుమంత్ చేసుంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సరసన సుమంత్ ఉండేవాడు..
- Actress Saipallavi : ఎగ్జామ్ సెంటర్ లో సాయిపల్లవి. షాకైన స్టూడెంట్స్
- Wife Killed Husband : ఈ కిలాడీ.. కరోనాతోనే గేమ్స్ ఆడింది..!
- Durga Rao : TV5 ఇదేనా మీ సంస్కారం.. కనీసం కుర్చీలు కూడా లేవా?
- ఈ బస్ స్టాప్ మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా!
- ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేం నాగరాజు భార్యను చూసారా!
- ఆ ఒక్క మిస్టేక్ చెన్నకేశవరెడ్డి సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టలేకపోయింది!
- Akkineni nagarjuna akkineni sumanth batukamma Batukamma.com Sumanth Sumanth hero sumanth missing movies Sumanth movies Sumanth rejected movies Sumanth songs telugu cinema tollywood Yarlagadda Sumanth Kumar అక్కినేని ఫ్యామిలీ అక్కినేని మూడోతరం హీరో సుమంత్ సుమంత్ అక్కినేని సుమంత్ యార్లగడ్డ హీరో సుమంత్