Top
Batukamma

Sudheer Babu : ఈ సినిమాకి 300కి పైగా ప్రొడ్యూసర్లు..!

Sudheer Babu : ఈ సినిమాకి 300కి పైగా ప్రొడ్యూసర్లు..!
X
Highlights

కసి తోనే ఇండస్ట్రీకి వస్తారు చాలామంది.. దానికోసం ఎన్ని పస్తులు అయిన ఉంటారు.

Sudheer Babu SMS : సినిమా.. ఇదో కళ .. ఏది ఏమైనా సరే స్క్రీన్ పైన పేరు చూసుకోవాలనే కసి తోనే ఇండస్ట్రీకి వస్తారు చాలామంది.. దానికోసం ఎన్ని పస్తులు అయిన ఉంటారు.. ఆ కష్టానికి అదృష్టం తోడైతే ఇండస్ట్రీలో నిలబడతారు.. ఇది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప్రయత్నం చేసేవారి గురించి.

కానీ కొంచం రిఫరెన్స్ ఉంటే ఎంట్రీ ఈజినే.. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ అయిన సుధీర్ బాబు(Sudheer Babu)కి వెనుక బ్యాక్ గ్రౌండ్ చాలా ఉన్నప్పటికీ దాన్ని వాడుకోకుండా ఓన్ గానే ఎదిగాడు.

మొదటి సినిమా SMS ( శివ మనసులో శృతి). తాతినేని సత్య డైరెక్టర్.. తమిళ్ లోని ఓ మూవీకి ఇది రీమేక్.. అప్పటికే ఆర్య, భద్ర, బొమ్మరిల్లు సినిమాలకి డిస్ట్రిబ్యూషన్ చేసి సంపాదించిన డబ్బులను మొత్తం ఈ సినిమాకి పెట్టేశాడు. కృష్ణ, మహేష్ , తండ్రి హెల్ప్ కూడా తీసుకోలేదు.. చివరికి ఆయన తండ్రి హెల్ప్ కూడా.

SMS (Shiva Manasulo Shruti) 2020 New Released Hindi Dubbed Full Movie | Sudheer  Babu, Regina - YouTube

ఇక షెడ్యూల్ షెడ్యుల్ కి బడ్జెట్ పెరుగుతుంది. ఉన్న డబ్బు కూడా అయిపోవడంతో సుధీర్ ఫ్రెండ్స్ కొందరు డబ్బులు పెట్టారు.. ఫైనాన్స్ నుంచి అప్పు తెచ్చారు. ఈ సినిమా అయిదు వందల నుంచి అయిదు లక్షల వరకు చాలా మంది డబ్బులు పెట్టారు..

ఇక సినిమా టైంలో ఆఫీస్ పక్కనే ఉన్న ఓ టీ కొట్టులో టీ తాగేవారు మేకర్స్. అలా అలా సినిమా అయిపోయేలోపు అదో పెద్ద బిల్లు అయింది. ఓ రోజు బిల్లు అడగడానికి బిల్లు కొట్టువాడు ఆఫీస్ కి రాగా సుధీర్ బాబు ఒక్కడే ఆఫీస్ లో ఉన్నాడట.

దీనితో డబ్బులు లేక తన మామ కృష్ణ గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ని తాకట్టు పెట్టేదాం అనుకోని ఆ టీ కొట్టు అతనికి వాచ్ ఇచ్చాడట.. కానీ అతనికి సుధీర్ బాబు తెలియడంతో వద్దు అన్నాడట.. ఈ విషయాలని సుధీర్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Image

ఇన్ని అడ్డంకులు దాటుకుని 10 ఫిబ్రవరి 2012 లో సినిమాని రిలీజ్ చేస్తే టాక్ బాగానే వచ్చిన ప్రాఫిట్స్ రాలేదు. దీంతో అప్పుల వాళ్ళు సుధీర్ బాబును అడగడం మొదలు పెట్టేశారు.. ఆ తరువాత ఆ అప్పు వాళ్ళ నాన్నగారు తీర్చేశారు.

ఇప్పటివరకు సుధీర్ బాబు 11 సినిమాలు చేస్తే ఒకటో రెండో సినిమాలు ప్లాప్ అయ్యాయి.. 80 % సక్సెస్ అయినవే.

Read Also


Next Story
Share it