Biggboss 4 : బిగ్ బాస్ 4 పని అయిపోయినట్టేనా..?

కరోనా టైం కావడంతో ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వారిని అలాగే హౌస్ లోకి పంపిస్తే కరోనా సోకే ఛాన్సెస్ చాలా ఉన్నాయి.
Big shock to biggboss4 : స్టార్ మా లో ప్రసారమయ్యే రియాలిటీ షో.. బిగ్ బాస్ కు బాలారిష్టాలు తప్పడం లేదు. ప్రతీ సీజన్ లోనూ ప్రారంభం నుంచి చివరి వరకు వివాదాలు వస్తూనే ఉన్నాయి. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభం కాబోతోంది. ఈ నెల 30 న షో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే.. అంతలోనే షో పై వివాదాలు ముసురుకుంటున్నాయి. కరోనా టైం కావడంతో ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 16 మంది కంటెస్టెంట్ లను ఎంపిక చేశారు. వారిని అలాగే హౌస్ లోకి పంపిస్తే కరోనా సోకే ఛాన్సెస్ చాలా ఉన్నాయి.
- Anasuya : చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప!
జై మూవీ హీరోయిన్ కి ఈ నటుడికి ఏంటి సంబంధం?
నీకో దండం.. ఇద్దరు పిల్లల తల్లిలా నడుచుకోవమ్మా.. ‘అనసూయ’ని ఉతికారేశారు!
కరోనా భయం లేకుండా ఉండేందుకు వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచారు. ఎవరికి కరోనా సింప్టమ్స్ లేకపోవడంతో షో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే.. కంటెస్టెంట్ లలో ఒకరికి కరోనా వచ్చిందనే వార్త సోషల్ మీడియా సర్కిళ్లలో వాయు వేగంతో చక్కర్లు కొడుతోంది. దీంతో షో నడుస్తుందా..? లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
దీనికి తోడు ఇప్పుడు మరో వివాదంలో పడింది బిగ్ బాష్ షో. కరోనా టైంలో ఇలాంటి షో నిర్వహించడం వల్ల మరింత ప్రమాదం ఉందంటూ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. బిగ్ బాస్ 4ను నిలిపేయాలంటూ రేఖ ముక్తల తెలంగాణ మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ ఆపేయాలంటూ మరికొందరు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
అయితే.. ఇన్ని వివాదాలు, కరోనా భయం మధ్య బిగ్ బాస్ షో ఎలా రన్ అవుతుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
- batukamma Batukamma.com Big shock to biggboss4 biggboss 4 telugu biggboss 4 telugu contestents biggboss4 corona positive in biggboss 4 house corona tension to biggboss 4 telugu nagarjuna in biggboss బతుకమ్మ బిగ్ బాస్ 4 బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్లు బిగ్ బాస్ 4 తెలుగుకు కరోనా టెన్షన్ బిగ్ బాస్ హౌస్ లో కరోనా వైరస్