sonu sood property :సోనూసూద్ ఆస్తి ఎంత.. ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఎంత?

sonu sood property : లాక్ డౌన్ సమయంలో వలసకూలీలు పడ్డ అవస్థ అంతా ఇంతా కాదు.. తినడానికి తిండి లేకా చేతిలో ఉన్న...
sonu sood property : లాక్ డౌన్ సమయంలో వలసకూలీలు పడ్డ అవస్థ అంతా ఇంతా కాదు.. తినడానికి తిండి లేకా చేతిలో ఉన్న డబ్బులు లేకా ఉపాధి కోల్పోయి నరకయాతన చూశారు. అలాంటి వాళ్లకి నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చాడు నటుడు సోనూసూద్..
వారికోసం ప్రత్యేకంగా బస్సులను, రైళ్ళను, విమానాలను ఏర్పాటు చేసి వారిని సొంత గూటికి చేర్చాడు. సినిమాలో విలన్ అయిన రియల్ లైఫ్ లో అందరి చేత హీరో అనిపించుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఎవరికీ ఏ కష్టం వచ్చిన సరే ఆపద్బాంధవుడు లాగా ముందుకు వస్తున్నాడు.
అయితే ఇంత చేస్తున్న సోనూసూద్ కి అన్ని డబ్బులు ఎక్కడివి ? అతని ఆస్థి విలువ ఎంత అన్నది చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్నలు.. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ అధ్యయనం చేయగా అతడి మొత్తం ఆస్తుల విలువ రూ. 130 కోట్లు అని తేలింది.
అయితే ఈ మొత్తం డబ్బులను సూనుసూద్ గత 20 ఏళ్లుగా సినిమాలలో నటించి సంపాదించినవే అని తెలిసింది.. అయితే తన ఆస్థిలో ఒక్క లాక్ డౌన్ టైంలోనే పేదల కోసం పది కోట్ల రూపాయలని ఖర్చు చేశాడట సూనూసూద్.. బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే విలన్ లో సూనుసూద్ ఒకడు.
ఇప్పుడు కానీ ఇక మీదట ఎవరికి ఎలాంటి సహాయం చేసేందుకు అయిన తానూ సిద్దమే అంటున్నాడు సోనుసూద్.. తానూ రాజకీయాల్లోకి రావడం కోసం చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు సూనూసూద్!
- batukamma Batukamma news Batukamma.com Bollywood Bollywood actor Sonu Sood Bollywood News coronavirus lockdown Movie News net worth online breaking news Sonu Sood sonu sood hero sonu sood Movies sonu sood property sonu sood Upates Telugu latest News Telugu news ఆస్తి విలువ తాజా వార్తలు బతుకమ్మ. తెలుగు వార్తలు బాలీవుడ్ సినిమా వార్తలు సోనూ సూద్