Top
Batukamma

గ్రాండ్ గా మూడు పెళ్ళిళ్ళు .. అడ్డంగా ఇలా దొరికిపోయాడు!

గ్రాండ్ గా మూడు పెళ్ళిళ్ళు .. అడ్డంగా ఇలా దొరికిపోయాడు!
X
Highlights

పిల్లలకు పాఠలు చెప్పే ఓ ప్రధానోపాధ్యాయుడే దారి తప్పాడు.. ముగ్గురు యువతులను ఒకరికి తెలియకుండా మరోకరిని పెళ్లి...

పిల్లలకు పాఠలు చెప్పే ఓ ప్రధానోపాధ్యాయుడే దారి తప్పాడు.. ముగ్గురు యువతులను ఒకరికి తెలియకుండా మరోకరిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. శీలం సురేష్‌ అనే ప్రధానోపాధ్యాయుడు 2011లో గుంటూరుకు చెందిన శాంతిప్రియను మొదటి పెళ్లి చేసుకున్నాడు.

ఆ తర్వాత ఆమెకి తెలియకుండా 2015లో ఉయ్యూరుకు చెందిన శైలజను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరిద్దరికీ తెలియకుండా 2019లో విశ్వనాథపల్లికి చెందిన అనూషను మూడో వివాహం చేసుకున్నాడు.

అయితే రెండో భార్య శైలజకి మనోడి విషయం తెలియడంతో గుట్టురట్టు అయింది. దీంతో ఆమె దిశా పోలీస్‌స్టేషన్‌ లో కేసు నమోదు చేసింది. దీనిపైన పోలిసుల చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక శీలం సురేష్‌ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story
Share it