పబ్ జీ తో పాటు 118 మొబైల్ యాప్స్ పై నిషేధం!

ఇటివల టిక్ టాక్ తో పాటుగా పలు చైనా యాప్ లను కేంద్రం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా కేంద్రం మరో కీలక...
ఇటివల టిక్ టాక్ తో పాటుగా పలు చైనా యాప్ లను కేంద్రం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్ జీ తో పాటు.. 118 మొబైల్ యాప్స్ పై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ యాప్స్ దేశ సౌరభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నందునే నిషేధించినట్టు కేంద్రం ప్రకటించింది. ఇవి దేశ రక్షణకు, భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని వెల్లడించింది.
ఈ యాప్స్ యూజర్ డేటా, లొకేషన్ తో పాటు.. యూజర్ కు సంబంధించిన సమాచారాన్ని లాగేస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ యాప్ లను నిషేధించినట్టు కేంద్రం స్పష్టం చేసింది.
ఇక ఇందులో పబ్ జీ యాప్ కి చాలా మంది చిన్న పిల్లలు అడిక్ట్ అయిన సంగతి తెలిసిందే. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దీనిలోనే మినిగి తెలిపోతున్నారు. దీనితో దీనిని నిషేధించాలని డిమాండ్లు వచ్చాయి, అయితే యువత మాత్రం పబ్ జీ బ్యాన్ పై బిన్న అభిప్రాయలను వ్యక్తం చేస్తోంది.
- Durga Rao : TV5 ఇదేనా మీ సంస్కారం.. కనీసం కుర్చీలు కూడా లేవా?
- Chicken VS Egg : చికెన్ VS గుడ్డు- ఏది ఎక్కువ ప్రోటీన్స్ కలిగి ఉంటుంది?
- vakeel saab : వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ లో ఈ హైలెట్స్ గమనించారా?