Top
Batukamma

Chicken Price : చికెన్ తినాలంటే మీ పర్సు చూసుకోవాల్సిందే.. !

Chicken Price : చికెన్ తినాలంటే మీ పర్సు చూసుకోవాల్సిందే.. !
X
Highlights

ఇప్పుడు సీన్ మారిపోయింది.. రెండు రోజులకు ఒక్కసారి అయిన ముక్క పడాల్సిందే..

Chicken Prices Increasing In Hyderabad : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను తట్టుకోవాలంటే రోగనిరోధకశక్తి తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.. దీనితో ప్రతి ఒకరు తమని ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.. అందులో భాగంగానే ప్రోటీన్స్ ఎక్కువగా చికెన్లో ఉండడంతో చికెన్ కి డిమాండ్ పెరిగిపోయింది..

వాస్తవానికి కరోనా జంతువులు నుంచి ఎక్కువగా వస్తుందని మొదట్లో చికెన్ అంటేనే వనికిపోయారు జనాలు.. కరోనా ప్రారంభ దశలో కోళ్లను ఫ్రీ గా ఇచ్చిన తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు.. ఇప్పుడు సీన్ మారిపోయింది.. రెండు రోజులకు ఒక్కసారి అయిన ముక్క పడాల్సిందే..

Read Also :

అయితే మొన్నటివరకు కిలో 180 నడిచిన చికెన్ ఇప్పుడు ఏకంగా 60 రూపాయలు పెరిగి 240 నడుస్తుంది. కొన్ని చోట్లల్లో 260 కూడా నడుస్తుంది.. ఇప్పుడు చికెన్ తినాలంటే సామాన్య మానవుడు ఒక్కసారి పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయితే మార్కెట్ లో కోళ్ళు దొరకడం లేదని, అందుకే ధరలు పెరిగినట్టు వ్యాపారాలు చెప్తున్నారు.

అటు కూరగాయలు కూడా తక్కువ ధర ఎం లేవు.. ఏది ముట్టుకున్న 50 పైనే ఉంది.. సమృద్ధిగా వర్షాలు కురిసి పంట చేతికి వచ్చినా ధరలు పెరగడంతో వినియోగదారులుఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read Also

Next Story
Share it