Top
Batukamma

Chiranjeevi Impressed : హల్చల్ చేస్తున్న "ఇందువదన.." కవర్ సాంగ్

Chiranjeevi Impressed : హల్చల్ చేస్తున్న ఇందువదన.. కవర్ సాంగ్
X
Highlights

మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన సుధాకర్ తన భార్య హారికతో కలిసి మెగాస్టార్ బర్త్ డే కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

Chiranjeevi Impressed on Induvadana Cover Song : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఛాలెంజ్' మూవీ అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా సూపర్ హిట్. ఇందులోని 'ఇందువదన కుందరదన..” పాట ఎంత పెద్ద హిట్లో అందరికి తెలిసిందే. అప్పట్లో ఇండస్ట్రీని ఊపు ఊపేసిన ఈ పాట.. ఇప్పుడు మరోసారి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

అప్పట్లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నాగరాజు అనే పాత్ర బాగా పాపులర్ అయింది. నాగరాజు క్యారెక్టర్ చేసిన సుధాకర్ కోమాకుల ఇప్పుడు ఇందువదన కుందరదన సాంగ్ మరోసారి ట్రెండ్ అయ్యేందుకు కారణమయ్యాడు.

మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన సుధాకర్ తన భార్య హారికతో కలిసి మెగాస్టార్ బర్త్ డే కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఈ గిఫ్ట్ కి చివంజీవి సైతం ఫిదా అయ్యాడు. సుధాకర్, హారిక కలిసి సాంగ్ ను రీ షూట్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

[embed]https://www.youtube.com/watch?v=gyrZL7974Tc[/embed]

సుధాకర్ , హారిక చేసిన ప్రయత్నానికి మెగాస్టార్ ఫిదా అయిపోయాడు. వారిని అభినందిస్తూ ఓ ఆడియో రిలీజ్ చేశాడు. అద్భుతంగా చేశారని పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రస్తుతం సుధాకర్, హారిక అమెరికాలో ఉన్నారు. దీంతో ఇండియాలో ఉంటే సంతోషాన్ని మరోలా చూపేవాడినని.. అమెరికాలో ఉన్నందున పర్సనల్ గా కలవలేకపోతున్నానని చెప్పారు చిరంజీవి.

[embed]https://www.facebook.com/sudhakar.komakula/posts/3211569615547539[/embed]

Read Also :

Next Story
Share it