Top
Batukamma

బ్రహ్మాజీ.. అవసరమా దూల కాకపోతే!

బ్రహ్మాజీ.. అవసరమా దూల కాకపోతే!
X
Highlights

హైదరాబాదులో ఇటీవల దాదాపు రెండు రోజులు ఆగకుండా కురిసిన వర్షంతో పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాదులో ఇటీవల దాదాపు రెండు రోజులు ఆగకుండా కురిసిన వర్షంతో పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ కూడా చాలాచోట్ల ఇంట్లో నివసించే పరిస్థితి లేదు..

టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీకి కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో వాళ్ళ ఇంటి దగ్గర కూడా నీళ్ళు నిలిచిపోయాయి. వాళ్ళ ఇంటి ముందున్న రోడ్డు మొత్తం నీళ్లు నిలిచిపోయిన ఫోటోలను తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. వాళ్ల అపార్ట్మెంట్ బేస్మెంట్ కూడా నీళ్లతో నిండిపోయింది అన్నారు.

ఆ తర్వాత తాను ఒక బోట్ కొనాలి అనుకుంటున్నట్టు తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు బ్రహ్మాజీ. హ్యూమరస్ గా చేసిన ఆ ట్వీట్, బ్యాక్ ఫైర్ అయ్యింది. నెటిజన్లు ఆ మాట ఇన్ సెన్సిటివ్ గా ఉందని, హైదరాబాదులో ఉంటూ, హైదరాబాదునే అవమానిస్తావా.. అని, ఆ పోస్ట్ కి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఫన్నీగా చేసిన ట్వీట్ కి ట్రోలింగ్ ఎక్కువవడంతో, ట్రోల్స్ దెబ్బకి తట్టుకోలేక తన సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేశారు బ్రహ్మాజీ.

Nagaraju Munnuru

Next Story
Share it